ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్ విషాదం చోటుచేసుకుంది. టన్నెల్‌లో సెల్ ఫోన్ సిగ్నల్ రాకపోవటంతో ఓ నిండు ప్రాణం బలైంది. దీంతో ఓ కుటుంబంలో పెను విషాదం నెలకొంది.
ఢిల్లీలోని ప్రగతి మైదాన్ రోడ్ టన్నెల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇది మొట్ట మొదటి రోడ్డు సొరంగం. ఈ టన్నెల్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రారంభించబడింది. దీని ద్వారా ట్రాఫిక్ చాలా వరకు నియంత్రించవచ్చు. సమయం కూడా ఆదా అవుతుంది. ఇది ఢిల్లీ నగరంలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీని నిర్మాణంతో నోయిడా, ఘజియాబాద్, తూర్పు ఢిల్లీ నుండి సెంట్రల్ ఢిల్లీకి ప్రయాణించే వారికి దాదాపు 10-15 నిమిషాలు ఆదా అవుతుంది. ఫైర్ మేనేజ్ మెంట్, సీసీటీవీ కెమెరాలు, అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ టన్నెల్ నిర్మితమైంది.
అలాంటి ఈ టన్నెల్‌లో విషాదం చోటుచేసుకుంది. అత్యవసర సమయానికి సెల్ సిగ్నల్ దొరక్క ఓ టీనేజర్ నిండు ప్రాణం పోయింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ ప్రగతి మైదాన్ టన్నెల్‌లో బుధవారం ఓ వ్యక్తి బైక్ పై వెళ్తూ ప్రమాదానికి గురైయ్యాడు. అతని హెల్మెట్ ఎగిరిపడి తలకు బలమైన గాయమైంది. చుట్టుపక్కన ఉన్నవాళ్లు అతనిని కాపాడే ప్రయత్నం చేశారు. ఎమర్జెన్సీ సేవల కోసం అంబులెన్స్ కు కాల్ చేయగా సెల్ సిగ్నల్స్ దొరకలేదు. దీంతో వారి ప్రయత్నం ఫలితం లేకుండా పోయింది.
కొందరు బయటికి వెళ్లి ఫోన్ చేయగా చాలాసేపటికి అంబులెన్స్ వచ్చింది. అతనిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే లోపే మరణించాడు. కొంచెం ముందుగా వచ్చి ఉంటే ఓ నిండు ప్రాణం దక్కేదని వైద్యులు చెబుతున్నారు. టన్నెల్ లోపల సిగ్నల్ అందక ఈ పరిస్థితి ఎదురైందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని వారు చెబుతున్నారు. మరి, ఈ విషాద సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A biker was killed in a road mishap at Pragati Maidan tunnel in Delhi. #CCTV #cctvfootage #pragatimaidan #Delhi #India #viral #viralvideo #viral2023 #ViralVideos #Accidents pic.twitter.com/TcBJrwhGwr
— Anjali Choudhury (@AnjaliC16408461) May 25, 2023