ఈ మద్య కాలంలో తరచుగా ఈ కామర్స్ వినియోగదారులకు పెద్ద పెద్ద షాకులు తగులుతున్నాయి. ఆన్ లైన్ లో ఫోన్లను ఆర్డర్ చేస్తే సబ్బు బిళ్లలు, ఇటుకలు వచ్చిన సంఘటనలను మనం గతంలో ఎన్నో చూశాం. అయితే అలాంటి మోసాలను ఎక్కువగా డెలివరీ బాయ్స్ చేసేవారు. కనుక వాటికి చెక్ పెట్టేలా ఈ-కామర్స్ సంస్థలు పకడ్బందీగా చర్యలను తీసుకుంటున్నాయి. డెలివరీ బాయ్ సమక్షంలోనే తాము ఆర్డర్ చేసిన వస్తువులు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అలా ఓపెన్ చేశాక వస్తువు ఉంటే ఓకే.. లేదంటే దాన్ని అలాగే అప్పటికప్పుడే రిటర్న్ పంపి రీఫండ్ పొందవచ్చు. నిజానికి ఇది ఎంతో మంచి సదుపాయం.
తాజాగా ఓ వ్యక్తికి ఐఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బు బిళ్ల దానితో పాటు ఐదురూపాయల బిల్ల వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చి పట్టణానికి చెందిన నూరుల్ అమీన్ అనే ఓ ఎన్నారై ఇటీవల అమెజాన్ లో ఐఫోన్-12 బుక్ చేశాడు. రూ. 70,900 ముందుగానే చెల్లించాడు. అమెజాన్ పే ద్వారా చెల్లింపు చేశాడు. ఆర్డర్ చేసిన మూడు రోజుల తర్వాత నూరల్‌కు అమెజాన్ డెలివరీ బాయ్ పార్శిల్ తెచ్చి ఇచ్చాడు. దాంతో డెలవరీ బాయ్ ముందే ఆ పార్శిల్‌ను ఓపెన్ చేశాడు. తీరా పార్శిల్ తెరిచి చూస్తే అందులో ఒక వీంబార్, రూ.5 బిళ్లా కనిపించాయి. బాక్స్ ఓపెన్ చూసి అందులో వస్తువులు చూడగానే మనోడికి మైండ్ బ్లాక్ అయ్యింది. కాకపోతే నూరుల్ అమీన్ అప్పటికే ఆన్‌లైన్ మోసాలపై అవగాహనతో ఉండటంతో పార్శిల్‌ను తెరిచే సమయంలో వీడియో రికార్డు చేశాడు. దాని సాయంతో సైబర్ క్రైమం పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసుల విచారణలో అదే IMEI నెంబర్ గల ఫోన్ ఇప్పటికే జార్ఖండ్‌లో వినియోగంలో ఉన్నట్లు తెలిసింది. జార్ఖండ్‌లో ఎవరో నూరుల్ ఆర్డర్ చేసిన ఫోన్‌ను సెప్టెంబర్ 2021 నుండి ఉపయోగిస్తున్నారు. అక్టోబర్ 12న నూరల్ ఆర్డర్ చేయగా అది అక్టోబర్ 15న డెలివరీ అయ్యింది. ఈ విషయంపై స్పందించిన సదరు సంస్థ ఈ తప్పు ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామని, ప్రస్తుతానికి స్టాక్ అయిపోయిందని, నూరుల్ చెల్లించిన మొత్తం తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. పరావుర్‌కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆన్‌లైన్‌లోనే రూ. 1,14,700 విలువైన ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే పాత వార్త పత్రికలతో కూడిన పార్శిల్ వచ్చింది. ఏది ఏమైనా.. మీరు కూడా ఆన్‌లైన్‌లో ఫోన్‌కు ఆర్డర్ పెడితే.. డెలివరీ బాయ్ ఎదుటే బాక్స్ ఓపెన్ చేసేలా సదుపాయాన్ని ఎంచుకుంటే మంచిదని బాధితులు చెబుతున్నారు.