బుద్దిగా చదువుకొని పరిక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలన్న తపనతో ఎంతో మంది విద్యార్థులు పగలూ.. రాత్రి కష్టపడి చదువుతుంటారు. తాము పడ్డ కష్టానికి ప్రతిఫలం వస్తే సంతోషంలో మునిగి తేలిపోతారు. కానీ ఈ మద్య కొంత మంది విద్యార్థులు మాత్రం ఏమాత్రం కష్టపడకుండా కాపీ కొట్టి ఈజీగా పాస్ కావొచ్చు.. మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు అన్న ధీమాలో ఉంటున్నారు. దారుణమైన విషయం ఏంటంటే… ఉద్యోగార్హత పొందేవారుకూడా ఈ అకృత్యాలకు పాల్పపడుతున్నారు. అందుకోసం టెక్నాలజీ కూడా వాడేస్తున్నారు.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగ అర్హత కోసం నిర్వహించే పరీక్షల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎలాంటి కాపీయింగ్ చేసినా వేటు పడుతుంది. ఎంతో పకడ్బందీగా, జాగ్రత్తగా నిర్వహిస్తారు. బాగా చెక్ చేశాకే అభ్యర్థులను ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతిస్తుంటారు. సెల్ ఫోన్లు, గ్యాడ్జెట్లు వెంట తీసుకురానివ్వరు. కాపీ కొట్టే అవకాశమే ఉండదు. కానీ ఈ మద్య కొంత మంది కాపీరాయుళ్ళు మాత్రం కొత్త కొత్త టెక్నాలజీ పద్దతలు పాటిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఆ మద్య రాజస్థాన్ లో ఉపాధ్యాయుల ఎంపికకు నిర్వహించిన అర్హత పరక్షలో కొందరు అభ్యర్థులు హైటెక్ కాఫీయింగ్ పాల్పడ్డారు. ‘బ్లూటూత్ అమర్చిన చెప్పులు’ ధరించి కాపీ కొట్టే ప్రయత్నం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ హార్డ్‌వేర్ చెప్పల్స్ ను చీటింగ్ చేయడానికి అభ్యర్థులకు రూ. 2 లక్షల వరకు అమ్ముతున్నారని తెలుస్తోంది.
ఇక రాజస్థాన్ హైటెక్ కాపీయింగ్ సంఘటన మరువక ముందే.. మహారాష్ట్రలో మరో మాస్టర్ ప్లాన్ వెలుగులోకి వచ్చింది. షాకింగ్ విషయం ఏంటంటే.. ప్రజలను రక్షించాల్సిన పోలీస్ ఉద్యోగానికి వచ్చిన వ్యక్తి హైటెక్ విధానంలో కాపీ కొట్టి పోలీసులకే బుక్ అయ్యాడు. ఔరంగాబాద్‌లోని వైజాపూర్ ప్రాంతానికి చెందిన ప్రతాప్ సింగ్ బలోధ్.. జల్గావ్‌లోని వివేకానంద్ ప్రతిష్ఠాన్ ఉన్నత పాఠశాలలో పోలీసు కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్షకు హాజరయ్యే ముందు రెండు సార్లు టాయిలెట్ లోకి వెళ్లి రావడంతో అధికారులు.. క్షణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు. సదరు వ్యక్తి చెవిలో మైక్రోచిప్‌ను కనుగొన్నారు. అయితే.. కాల్‌ను రిసీవ్ చేసుకునే విధంగా కాలికి బ్లూటూత్ పరికరాన్ని సైతం అతను ఏర్పాటు చేసుకున్నట్లు జల్గావ్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ రామకృష్ణ కుంభార్ తెలిపారు. ప్రతాప్ సింగ్ బలోధ్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వివరాలు సేకరిస్తున్నామన్నారు పోలీసులు తెలిపారు.
What an effort to cheat for constable exam in Jalgaon. Microchip in the ear!!! Worth noticing. @DGPMaharashtra @PIBMumbai pic.twitter.com/jal4cytlgO
— Sanjay (@sanjayp_1) October 9, 2021