నూటికి 10 శాతం మాత్రం ప్రేమలు సఫలీకృతమయ్యి పెళ్లి పీటలు ఎక్కుతున్నాయి. మిగిలిన ప్రేమలన్నీ కంచికి చేరని కథల్లా మారిపోతాయి. ప్రేమించిన అమ్మాయి మరొకరిని మనువాడితే తట్టుకోలేని ప్రియుడి హృదయం దుర అలవాట్లకు లోనవుతుంది. మానసికంగా క్రుంగిపోయి..
నూటికి 10 శాతం ప్రేమలు మాత్రమే సఫలీకృతమయ్యి పెళ్లి పీటలు ఎక్కుతున్నాయి. మిగిలిన ప్రేమలన్నీ కంచికి చేరని కథల్లా మారిపోతాయి. ప్రేమించిన అమ్మాయి మరొకరిని మనువాడితే తట్టుకోలేని ప్రియుడి హృదయం దుర అలవాట్లకు లోనవుతుంది. మానసికంగా క్రుంగిపోయి.. ఆత్మహత్యకు ఒడిగడతారు. మరికొంత మంది మరో అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేస్తారు. సాధారణంగా ఇదే జరుగుతుంది. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక.. భర్తతో కలిసి ఉండలేక భార్య బాధపడుతుంటే.. తిరిగి ప్రియుడి చెంతకు చేర్చే భర్త ఉంటారా..? అలా చేస్తే అది సినిమానే అవుతుంది. తెలుగులో కన్యాదానం అనే సినిమా కథకు ఇదే ప్రేరణ. కానీ నిజ జీవితంలో ఓ వ్యక్తి ఇదే చేసి ప్రేమికుల దృష్టిలో దేవుడయ్యాడు.
ఈ ఘటన బీహార్‌లోని నవాడా జిల్లాలో చోటుచేసుకుంది. భార్య.. ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త పని నిమిత్తం బయటకు వెళ్లగా.. మహిళ అర్థరాత్రి తన ప్రియుడిని కలిసేందుకు వెళ్లింది. రాసలీలల్లో మునిగి తేలుతుండగా.. కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చెట్టుకు కట్టి బాగా తన్నారు. పొద్దునే పంచాయతి పెట్టించగా.. ఊరి నుండి ఇద్దర్ని వెలేస్తున్నట్లు తీర్పునిచ్చారు పెద్దలు. భర్త వచ్చాక విషయం తెలుసుకుని.. భార్యను ఏమి అనలేదు సరికదా.. భార్య కోరుకున్న ప్రియుడ్ని ఇచ్చి పెళ్లి చేశాడు. శివాలయానికి తీసుకెళ్లి.. అతడే పెళ్లి పెద్దయ్యి.. వారిద్దరికీ పెళ్లి చేశాడు.
ప్రస్తుతం ఈ న్యూస్ అంతటా హల్ చల్ చేస్తోంది. వీడియో కూడా చక్కర్లు కొడుతుంది. అందులో ప్రియుడు.. ప్రియురాలి మెడకు సింధూరం పెట్టినట్లు కనిపిస్తుంది. భార్య భావోద్వేగానికి లోనవుతుంది. కాగా, ప్రియుడికి గతంలో పెళ్లై.. ముగ్గురు పిల్లలు ఉండటం కొసమెరుపు. అయితే భార్యకు ఆమె లవర్‌తో పెళ్లి చేయడంపై గ్రామస్థులు, కుటుంబ సభ్యులు గుర్రుగా ఉన్నా.. వారిద్దరిని ఆశ్వీరదించి పంపించాడట భర్త. భార్య పరాయి పురుషుడ్ని చూస్తేనే తట్టుకోలేని భర్తలు ఉన్న ఈ రోజుల్లో, భార్యకు ప్రియుడ్నిచ్చి పెళ్లి చేసిన ఇలాంటి భర్తపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.