stone eating : బాగా ఉడికిన అన్నం తిని అరిగించుకోవటానికి నానా తంటాలు పడుతున్న రోజులివి. అలాంటిది రాళ్లు తింటే అరిగించుకోగలమా?.. రాళ్లను తినటం.. అరిగించుకోవటమా.. తింటే అరక్క ఛస్తాం.. అని అనుకుంటున్నారా?.. అది మనలాంటి మామూలు మనుషుల విషయంలో అయితే నిజం కానీ, ఛత్తీష్‌ఘర్‌కు చెందిన ఓ యువకుడి విషయంలో మాత్రం కాదు. ఆ యువకుడు ప్రతి రోజు రాళ్లు తింటాడు. అలా రాళ్లు తినటానికి ఓ పెద్ద కారణమే చెబతున్నాడు. ఆ కారణం తెలుసుకోవాలంటే ఈ వార్త చదవండి.. ఛత్తీష్‌ఘర్, జష్‌పుర్ జిల్లా, చిట్టలకు చెందిన సంతోష్ లక్ర గత 12 ఏళ్ల నుంచి రాళ్లు తింటున్నాడు. ఇంట్లో దేవుడి పటం ముందు మోకాళ్లపై కూర్చుని రాళ్లను ముందు పెట్టుకుంటాడు. కొద్దిసేపు ప్రార్థనలు చేస్తాడు. అనంతరం రాళ్లను తింటాడు.
ఇలా చేయటం వల్ల ప్రజల బాధలు తొలుగుతాయని చెబుతున్నాడు. రాళ్లు తిన్న తర్వాత భోజనం చేయాల్సిన అవసరం ఉండదు అంటున్నాడు. ఇలా రాళ్లను తినటం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది కలగటం లేదన్నాడు. గత 12 ఏళ్లుగా రాళ్లను తింటున్నట్లు పేర్కొన్నాడు. అతడి భార్య అనిత లక్ర కూడా భర్త వింత ప్రవర్తనకు అలవాటుపడిపోయింది. తన భర్త బస్తాడు రాళ్లు తినేశాడని చెప్పింది. ఇన్ని రాళ్లు తింటున్నా అతడికి ఎటువంటి జీర్ణ సంబంధ సమస్యలు రావటంలేదు. ఇప్పటి వరకు డాక్టర్‌ను కలిసింది కూడా లేదు. ప్రజల బాధలను తొలగించటానికి రాళ్లు తింటున్న సంతోష్ లక్రపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ట్రీట్‌మెంట్ చేస్తుండగా గర్భిణీ మృతి.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న డాక్టర్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.