భక్తిలో లీనమై దైవ సన్నిధిలో ఏ పని చేసినా దేవుడే అలా చేయించాడని అంటారు. కొంతమంది జనాలు ఏం చేస్తున్నారో కూడా తెలియని మూఢభక్తి కలిగి ఉంటారు. అలాంటిదే ఉత్తరప్రదేశ్‌లో కూడా ఓ ఘటన జరిగింది. ఓ యువకుడు తన తలను దేవుడికి నైవేద్యంగా సమర్పించాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
సాధారణంగా మనం గుడికి వెళితే విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థికంగా మన పరిస్థితుల గురించి, సంతానం గురించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని మొక్కుకుంటాం. కోరుకున్న కోరికలు తీరిన తర్వాత మొక్కులు తీర్చుకుంటాం. విపరీతమైన భక్తి పెరిగి కొందరు దేవుని ముందు అరచేతిలో కర్పూరం వెలిగిస్తారు. మరికొందరు నాలుకకు శూలాలను గుచ్చుకుని వారి భక్తిని చాటుకుంటారు. మోకాళ్లపై నడిచి వారి మొక్కులు తీర్చుకుంటుంటారు. భక్తిలో లీనమై దైవ సన్నిధిలో ఏ పని చేసినా దేవుడే అలా చేయించాడని అంటారు. కొంతమంది జనాలు ఏం చేస్తున్నారో కూడా తెలియని మూఢభక్తి కలిగి ఉంటారు. అలాంటిదే ఉత్తరప్రదేశ్‌లో కూడా ఓ ఘటన జరిగింది. ఓ యువకుడు తన తలను దేవుడికి నైవేద్యంగా సమర్పించాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ఉత్తర్ ప్రదేశ్ లలిత్ పుర్ జిల్లాకు చెందిన దీపక్ కుశ్వాహ అనే యువకుడు ఉన్నాడు. అతని వయసు 28 సంవత్సరాలు. అతనికి దైవభక్తి ఎక్కువ. గత కొన్నిరోజులుగా దీపక్ తన తలను దేవుడికి సమర్పించకుంటానని చుట్టుపక్కల వారితో చెప్పాడు. మంగళవారం పొద్దున్నే స్నానం చేసి చెట్లు నరికే కటర్‌ని తీసుకుని గుడి వద్దకు చేరాడు. దేవున్ని స్మరించుకుంటూ కట్టర్‌ను మెడలో వేసుకుని ఆన్ చేసి మెడ కట్ చేసుకున్నాడు. అతడి అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో దీపక్‌కు తీవ్ర రక్త స్రావం అవుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
అయితే దీపక్ గత కొన్ని రోజులుగా తన తలను దేవుడికి సమర్పించుకుంటానని చెబుతున్నట్లు దీపక్ సోదరుడు తెలిపాడు. కానీ దీపక్ అలా ఎందుకు చేశాడన్ని విషయం ఎవరికీ తెలయదని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఘటన ఊరి మొత్తానికి చర్చనీయాంశంగా మారింది. దేవుని ముందు ఆత్మార్పణం అని, హోమంలో దూకడం, తలను దేవుని ముందు నరక్కోవడం, నరబలులు ఇవన్నీ మూఢ భక్తికి ప్రతీకలు. భక్తి కలిగి ఉండాలి. కానీ మరీ ప్రాణాలు తీసుకునేంత ఉండకూడదు. అన్నింటికంటె ముఖ్యమైనది.. ఇతరులకు సేవ చేస్తూ ‘మానవ సేవే మాధవ సేవ’ అని గుర్తించాలి.