దేశంలో మళ్లీ కరోనా విజృంభణ కొనసాగుతుంది. కరోనా కట్టడికి ఏకైక ఆయుధం వ్యాక్సిన్. కొన్ని రాష్ట్రాల్లో కొరత కారణంగా వ్యాక్సిన్ కోసం చూస్తున్న వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. మరోవైపు అస్సలు వ్యాక్సిన్ మాకొద్దు బాబోయ్.. అంటూ జనాలు పరుగులు పెడుతున్నారు. ప్రాణాంతకమైన వైరస్ ను చంపే వ్యాక్సిన్ ఇంకెంత విషపూరితమైందోనని భయపడుతున్న గ్రామస్థులు. ఆ మద్య తనకు వ్యాక్సిన్ వేయడానికి వస్తే.. నాగుపాముతో కరిపిస్తానంటూ ఓ మహిళ పామును బయటకు తీయడంతో వైద్య సిబ్బంది ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. మరికొన్ని చోట్ల వ్యాక్సిన్ వేయడానికి వస్తున్న సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్లియా జిల్లాలో విచిత్ర వైఖరి కలిగిన ఇద్దరు వ్యక్తులను అధికారులు దొరకబట్టి ఎట్టకేలకు టీకాలు వేశారు. ఒకదశలో వ్యాక్సిన్ వేసే సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేయడం కూడా జరిగింది. వివరాల్లోకి వెళితే.. బల్లియా జిల్లా రియోటీ బ్లాక్‌లో ఓ బోట్ మ్యాన్ ఇప్పటివరకు టీకా తీసుకోలేదని గుర్తించి అధికారులు అతని దగ్గరకు వెళ్లారు. వ్యాక్సిన్ వేయడానికి వస్తున్న విషయం తెలుసుకొని ఆ వ్యక్తి పడవ ఎక్కాడు.. తాను వ్యాక్సిన్ వేసుకోనని అధికారులకు చెప్పాడు. పడవదిగి రమ్మని అధికారులు ఎంతచెప్పినా పట్టించుకోలేదు. వారు అక్కడ నుంచి వెళ్లకపోవడంతో కోపంతో పడవదిగి సిబ్బందిలో ఒకరిపై దాడి చేశాడు.. తిట్టాడు. ఎట్టకేలకు అధికారులు నచ్చజెప్పి అతనికి టీకా వేశారు.
#WATCH Boatman refuses to take vaccine, mishandles a health care worker
He was apprehensive initially but was convinced eventually to take vaccine. In another instance,a man climbed tree but took the vaccine eventually: Atul Dubey,Block Dev Officer,Reoti
(Source: Viral video) pic.twitter.com/fVk5BGbP46
— ANI (@ANI) January 20, 2022
ఓ వ్యక్తి అధికారులు టీకా వేసేందుకు వచ్చారని తెలిసి చెట్టెక్కాడు. గంటల కొద్ది అతని కోసం వేచి చూసినా అతడు మాత్రం చెట్టు దిగి రాలేదు. చివరిక బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రంగంలోకి దిగి అతడిని చెట్టుదించడమేగాక, నచ్చజెప్పి టీకా వేయించారు.ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Ballia, Bihar: Atul Dubey, Block Development Officer, Reoti says, “A man climbed a tree as he didn’t want to take the vaccine, but agreed to take the jab after he was convinced by our team.”
(Source: Viral Video) pic.twitter.com/aI054zh9Y4
— ANI (@ANI) January 20, 2022