ఒక యువకుడు ఒక యువతిని బలవంతంగా కారు ఎక్కించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె షర్టు పట్టుకుని బలవంతంగా కారు ఎక్కించడమే కాకుండా ఆమెపై చేయి చేసుకున్నాడు. మరి అమ్మాయిని వాళ్ళు ఏం అడిగారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ అమ్మాయి ఎందుకు దిగిపోయింది?
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆడవారికి భద్రత లేదు. పరిచయం లేని వారే కాదు పరిచయం ఉన్న వారు కూడా అమ్మాయిలపై దాడులు చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు ఒక యువతిని బలవంతంగా కారు ఎక్కించి.. కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి సమయంలో ఇద్దరు యువకులు, ఒక యువతి క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఎక్కడికో వెళ్తుండగా మార్గం మధ్యలో గొడవ తలెత్తింది. యువకులు యువతిని ఏమడిగారో ఏమో గానీ ఆ యువతి కారు దిగేసింది. దీంతో యువకుడు వెంటనే కారు దిగి ఆ యువతిని బలవంతంగా కారు ఎక్కించాడు. ఆ తర్వాత ఆమెపై చేయి చేసుకున్నాడు.
ఢిల్లీలోని మంగోల్ పూరి ఫ్లై ఓవర్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. యువతి పట్ల దురుసుగా ప్రవర్తించిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. శనివారం రాత్రి తమ దృష్టికి వచ్చిందని, వెంటనే దీన్ని సీరియస్ గా తీసుకున్నామని ఢిల్లీ ఔటర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరేందర్ కుమార్ సింగ్ వెల్లడించారు. వాహనాన్ని, క్యాబ్ డ్రైవర్ ని ట్రేస్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రాథమిక విచారణలో భాగంగా వీడియోలో కనబడుతున్న క్యాబ్ హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్ లోని రతన్ విహార్ ప్రాంతానికి చెందినదని పోలీసులు గుర్తించారు.
డ్రైవర్ ని విచారించగా.. ఇద్దరు యువకులు, ఒక యువతి ఉబర్ యాప్ ద్వారా రోహిణి నుంచి వికాసపురి ప్రాంతానికి బుక్ చేసుకున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత యువతితో యువకులు గొడవ పడినట్లు చెప్పుకొచ్చాడు. ఆ యువతి కారు దిగి బయటకు వెళ్లాలనుకున్నది. ఈ క్రమంలో బయటకు వెళ్లిన ఆ యువతిని యువకుడు బలవంతంగా ఆ కారు ఎక్కించాడు. ఆ తర్వాత ఆమెను కొట్టాడు. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. అయితే యువతి పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా ఈ వీడియోపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశ రాజధానిలో మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీడియోపై ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. యువతిని వేధించి బలవంతంగా కారులోకి ఎక్కించిన వీడియోను పరిగణలోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చినట్లు మహిళా కమిషన్ వెల్లడించింది. నిందితులపై మహిళా కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మరి అమ్మాయిని వాళ్ళు ఏం అడిగారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ అమ్మాయి ఎందుకు దిగిపోయింది?మరి అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ అమ్మాయి ఎందుకు దిగిపోయింది? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
A man was seen in a video beating a woman & forcefully making her sit in a car near #Mangolpuri flyover. Car is from #Gurugram‘s Ratan Vihar where a team of personnel was sent. Probe underway to ascertain more information about the driver & incident: Police (18.03) pic.twitter.com/8UGECYTNp1
— Smriti Sharma (@SmritiSharma_) March 19, 2023