ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వెనుక సీటులో పురుషులు ప్రయాణించడంపై అధికారులు నిషేధం విధించారు. అదనపు జేసీ ఆదేశాల మేరకు కేరళలోని పాలక్కడ్ లో ఈ రూల్ అమలులోకి వచ్చింది. కాగా, కొన్ని రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నిబంధన విధించినట్లు పాలక్కడ్ జిల్లా అధికారులు తెలిపారు. అయితే ఈ నిబంధనల నుంచి మహిళలు, చిన్నారులకు మినహాయింపును ఇచ్చారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 20వరకు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అసలు విషయంలోకి వెళ్తే..
ఇదీ చదవండి: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు.. మూడ్రోజుల పాటు యువతికి నరకం!
ఈనెల 15న SDPI కార్యకర్త హత్యజరిగింది. దానికి ప్రతీకారంగా RSS కార్యకర్త శ్రీనివాసన్ ను ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి హత్య చేశారు. దీంతో ఒకే రోజులో ఇలా రెండు హత్యలు జరగడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ రెండు హత్యలే కాక మరిన్ని హత్యలకు ప్రణాళి చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అడిషన్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధన నుంచి పిల్లలు, మహిళలను మాత్రం మినహాయించారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.