సోమవారం భారత దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అలానే దేశమంతటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈక్రమంలో అనేక మంది ప్రముఖులు దేశం గురించి ఎంతో విలువన విషయాలను ప్రసంగించారు. అయితే కేరళకు చెందిన ఓ తొమ్మిదేళ్ల చిన్నారి ఇచ్చిన స్పీచ్ అందరిని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. అంత చిన్న వయస్సులో స్వేచ్ఛలు, అక్రమాలు అంటూ ఆమె తన ప్రసంగంలో తెలిపింది. ప్రస్తుతం ఆ పాప ప్రసంగించిన రెండు నిమిషాలా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హత్రాస్ కుట్ర కేసులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసుపై అరెస్టైన మలయాళీ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్ కుమార్తె ఆ తొమ్మిదేళ్ల చిన్నారి. మలయాళం న్యూస్ పోర్టల్ అజిముఖం జర్నలిస్ట్, కేరళ వర్కింగ్ జర్నలిస్ట్ ఢిల్లీ యూనిట్ సెక్రటరీ సిద్ధిక్ కప్పన్ పనిచేశారు. 2020 అక్టోబర్‌లో హత్రాస్‌లో గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన ఓ దళిత చిన్నారి సంబంధించిన న్యూస్‌ను కవర్ చేయడానికి సిద్దిక్ కప్పన్ వెళ్తుండగా అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయని కూడా సిద్ధిక్‌పై ఆరోపింపణలు చేశారు. ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన జైలుకు పంపించారు. అప్పటి నుంచి సిద్ధిక్ జైల్లోనే ఉన్నారు. గతంలో మధుర కోర్టు, తాజాగా అలహాబాద్ కోర్టు సిద్దిక్ కప్పన్ బెయిల్ దరఖాస్తులను తిరస్కరించాయి.
తాజాగా ఆయన కుమార్తె మెహనాజ్ కప్పన్ ప్రసంగం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. “భారత పౌరులకు లభించే ప్రాథమిక పౌర హక్కులను తిరస్కరించడంతో జైల్లో మగ్గుతున్న పాత్రికేయుడి కూతుర్ని నేను” అంటూ సోమవారం తన పాఠశాలలో ప్రసంగాన్ని ప్రారంభించింది. భారతీయుల స్వేచ్ఛను కాలరాయకూడదని, ప్రతి భారతీయుడికి తమకు నచ్చినట్లు జీవించే హక్కు ఉందని తెలిపింది. అలాగే ఎవరు ఏ మతాన్ని, ఏ ఆహారం తిన్నాలో నిర్ణయించుకునే అధికారం అందరికి ఉందని మెహనాజ్ కప్పన్ తెలిపింది.
అంతేకాదు దేశంలో అశాంతి నెలకొందని, మతం, లింగం వంటి రాజకీయాల ప్రాతిపదికన హింస సాగుతుందని చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజల్లో ప్రేమ, ఐక్యతా భావాలు పెరగాలని సూచించింది. ఎలాంటి విభేదాలు లేని రేపటి కోసం కలలు కనాలని చెప్పింది. ఈమె స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి.. ఆ చిన్నారి స్పీచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
“I am Mehnaz Kappan. Daughter of journalist Siddique Kappan, a citizen who has been forced into a dark room by breaking all of the freedom of a citizen…”: 9-year-old daughter of Siddique Kappan in her Independence Day speech. Video by @AfeezaFathima
— Suchitra Vijayan சுசித்ரா விஜயன் (@suchitrav) August 16, 2022