టీకేడీ డబ్ల్యూడీ 4బీ 40049 రైలుకు ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.. అశోక చక్ర’ అని పేరు పెట్టింది. సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి చేరుకుని మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులతో పోరాడిన ధీరుడు
మన దేశం కోసంపోరాడే వారిలో ఆర్మీ జవాన్లు కీలక పాత్ర వహిస్తారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ప్రతి క్షణం దేశం కోసం పోరాడిన ఆర్మీ జవాన్లకు.. ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డే నాడు నివాళులు అర్పిస్తాం. వారిని స్మరించుకుని వారి సేవలను, త్యాగాలను కొనియాడుతాం. దేశం కోసం ప్రాణాలిచ్చిన వారిని స్మరించుకునేందుకు స్కూల్ పాఠాల్లో కూడా వారి జీవిత విశేషాలను పొందుపరుస్తూ ఉంటారు. దేశం కోసం పోరాడి ప్రాణాలు విడిచిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కూడా జాతి గర్వించ దగ్గ ఆర్మీ మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తన తుది శ్వాస వరకు ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందినందుకు భారతీయ రైల్వే ఘననివాళి అర్పించింది.
టీకేడీ డబ్ల్యూడీ 4బీ 40049 రైలుకు ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.. అశోక చక్ర’ అని పేరు పెట్టింది. ఉన్నికృష్ణన్ ఎవరో కాదు.. సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి చేరుకుని మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులతో పోరాడిన ధీరుడు. ముంబై తాజ్ హోటల్ ఉగ్రదాడి సమయంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తన ఆర్మీ సమూహంతో హోటల్ లోనికి ప్రవేశించారు. ఉగ్రవాదుల కాల్పులకు ఏమాత్రం బెదరకుండా పోరాడి వారి చెరనుండి సామాన్యులను కాపాడారు. ఈ ప్రయత్నంలో తీవ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారు.
అనేక బుల్లెట్లు అతని శరీరంలో చొచ్చుకునిపోగా రక్తపు మడుగులో అతని శరీరాన్ని కనుగొన్నారు. 28 నవంబర్ 2008న ఆయన మరణించారు. ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం ఆయన త్యాగాన్ని గుర్తించి 26 జనవరి 2009న ‘అశోక చక్ర ’బిరుదునిచ్చింది. తాజాగా భారతీయ రైల్వే ఒక రైలుకు ఆయన పేరు పెట్టి నివాళులు అర్పించింది. ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.. అశోక చక్ర’ పేరు ఒక రైలుకు భారతీయ రైల్వే నిర్ణయించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.