స్వాతంత్ర ఉద్యమం సమయంలో మహాత్మాగాంధీ అహింసా మార్గంలో బ్రిటీష్ వారిని ముప్పతిప్పలు పెట్టారు. మహాత్మాగాంధీ మహారాష్ట్రలోని మణి భవన్ లోనే ఎక్కువ బసచేసేవారు. స్వాతంత్ర సంగ్రామ సమయంలో తీసుకున్న కీలు నిర్ణయాలు ఇక్కడే నాంధిపడ్డాయని అంటారు.
దేశ స్వాతంత్రం కోసం అహింసా మార్గంలో పోరాడి జాతిపిత మహాత్మాగాంధీ ఇంట విషాదం నెలకొంది. మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకాని ముంబైలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. ఉషా గోకాని గత ఐదు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతుండగా రెండేళ్ల నుంచి మంచానికే పరిమితం అయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకాని మంగళవారం తన నివాసంలో తుది శ్వాసవిడిచారు. ఆమె వయసు 89 సంవత్సరాలు.. ఉష గత 5 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉష తన చిన్నతనం ఎక్కువగా మహారాష్ట్రలోని వార్దాలో గాంధీ స్థాపించిన సేవాగ్రామ్ ఆశ్రమంలో గడిపారు. 1917 నుంచి 1934 వరకు మహాత్మాగాంధీ ఎక్కువగా మణి భవన్ లోనే బసచేసేవారు. స్వాతంత్ర సంగ్రామ సమయంలో తీసుకున్న కీలు నిర్ణయాలు ఇక్కడే నాంధిపడ్డాయి. ఇక మణి భవన్ లో రెండు సంస్థలు ఉండేవి.. వాటిలో ఒకటి గాంధీ స్మారక్ నిధి, రెండవది మణి భవన్ గాంధీ సంగ్రహాలయ.
ముంబైలోని మణి భవన్ లో గాంధీ స్మారక్ నిధికి ఉష గోకాని చైర్ పర్సన్ గా కొంతకాలం పనిచేశారు. 1955, అక్టోబర్ 2 మహాత్మా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా మణిభవన్ ని గాంధీ మెమోరియల్ సొసైటీకి అప్పగించారు. కాగా, ఉషా గోకాని సోదరుడు, మహాత్మాగాంధీ మనువడు కాను రాందాస్ గాంధీ గుజరాత్ లోని సూరత్ లో 2016 లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు.