మహాత్మాగాంధీ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మనవడు అరుణ్ గాంధీ(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
మనదేశ జాతిపిత మహాత్మాగాంధీ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మనవడు అరుణ్ గాంధీ(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈరోజు కొల్హాపూర్‌లో అరుణ్ గాంధీకి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు తుషార్ గాంధీ తెలిపారు. ఆ వివరాలు..
మహాత్మా గాంధీ కొడుకు మణిలాల్ గాంధీ, సుశీ మష్రువాలా దంపతుల కుమారుడే.. అరుణ్ గాంధీ. ఆయన ఏప్రిల్ 14, 1934న డర్బన్‌లో జన్మించారు. అరుణ్ గాంధీ సామాజిక కార్యకర్తగా తన తాత అడుగుజాడల్లోనే నడిచేవారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న కొల్హాపూర్‌కు వచ్చిన అరుణ్ గాంధీ.. అక్కడే పదిరోజుల పాటు బస చేయాలని అనుకున్నారు. కానీ అనారోగ్యానికి గురికావడంతో అతనిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అనంతరం ఈ పరిస్థితులతో ప్రయాణాలు చేయడం మంచింది కాదని వైద్యులు సూచించడంతో కొల్హాపూర్‌లోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనమూ కోరుకుందాం..
Arun Gandhi, Grandson of Mahatma Gandhi took his last breath today in Kolhapur.
May his soul rest in peace !
His last rites will happen at Kolhapur today evening. I am in touch with his son Tushar gandhi and he is enroute Kolhapur pic.twitter.com/bfaj9DWd9q— Satej (Bunty) D. Patil (@satejp) May 2, 2023
Bereaved. Lost my father this morning🙏🏽
— Tushar बेदखल (@TusharG) May 2, 2023