చాలా మంది ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడే జాబ్‌ల్లో ముందు వరసలో ఉంటుంది బ్యాంక్ జాబ్. ఫిక్స్‌డ్ టైమింగ్స్… చక్కగా ఏసీలో కూర్చుని పని చేయవచ్చు.. అనే ఉద్దేశంతో చాలా మంది బ్యాంక్ జాబ్ కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే మహిళ మాత్రం.. బ్యాంక్ జాబ్ మేనేజర్ బాజ్‌ను వదిలేసి మరి.. ఆర్టీసీ డ్రైవర్‌గా మారింది. ఎందుకు ఇలా అంటే.. ఆమె మాటల్లోనే ఆ వివరాలు.. మహారాష్ట్రకు చెందిన శీతల్ శిందే.. ఈ అనూహ్య నిర్ణయం తీసుకుని.. అందరిని ఆశ్చర్యపరిచారు. శీతల్ శిందే 2014 నుంచి పుణెలోని యాక్సిస్ బ్యాంక్‌లో మేనేజర్‌గా నాలుగేళ్లు విధులు నిర్వహించారు. ఈ క్రమంలో మహారాష్ట్రం ప్రభుత్వం 2019లో మహిళా ఆర్టీసీ డ్రైవర్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది.
ఈ విషయం తెలిసిన వెంటనే శీతల్.. బ్యాంక్ మేనేజర్ జాబ్ వదిలేసి.. డ్రైవర్ జాబ్‌కు అప్లై చేసుకున్నారు. శీతల్‌తో పాటు 194 మంది మహిళలను ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగానికి ఎంపిక చేశారు. అయితే ఇదే సమయంలో కరోనా రావడంతో చాలా మంది డ్రైవర్ ఉద్యోగం అంటే భయపడ్డారు. 194 మందిని ఎంపిక చేస్తే.. చివరకు 17 మంది మాత్రమే మిగిలారు. వీరిలో శీతల్ కూడా ఒకరు. ట్రైనింగ్ పూర్తి చేసిన శీతల్.. తాజాగా ఫస్ట్ బ్యాచ్ ఆర్టీసీ డ్రైవర్‌గా బాధ్యతలు చేపట్టారు. మరి శీతల్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.