వారిద్దరూ కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా పెరిగారు. ఒకే చోట విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి.. సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకున్నారు. బాగా చదువుకున్నారు.. మంచి ఉద్యోగం సంపాదించుకున్నారు.. ఇక పెళ్లి చేయడమే తరువాయి. దాంతో ఆ కవల అక్కాచెల్లెళ్ల తల్లిదండ్రులు వారికి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఆ విషయం తెలిసి.. అక్కాచెల్లెళ్లు.. కలవరపడ్డారు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు.. ఇంత వరకు ఒక్క రోజు కూడా తామిద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే.. అత్తారింటికి వెళ్లాలి.. అప్పుడు విడిపోక తప్పదు అని బాధపడ్డారు. అందుకని వారు ఒక నిర్ణయం తీసుకున్నారు.
ఇద్దరు కలిసి ఒక్కడినే పెళ్లాడితే.. అప్పుడు ఇక జీవితాంతం కలిసి ఉండవచ్చు అని భావించారు కవల అక్కాచెల్లెళ్లు. అనుకున్నట్లుగానే అక్కాచెల్లెళ్లు ఇద్దరు.. ఒక్కడినే వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరలయ్యింది. అదిగో అక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. ఈ వీడియో చూసిన పోలీసులు.. నూతన వరుడికి ఊహించని షాక్ ఇచ్చాడు. ఆ వివరాలు..
ఈ సంఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. పింకీ, రింకీ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. కవల పిల్లలు. ఇద్దరు డిగ్రీ పూర్తి చేసి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా కొలువు సంపాదించారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం అక్కాచెల్లెళ్ల తండ్రి మృతి చెందాడు. వీరిద్దరూ తల్లితో కలిసి ఉంటున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే వారి తల్లి అనారోగ్యానికి గురయ్యింది. ఈ క్రమంలో వారిద్దరూ కారులో ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలా సదరు కారు డ్రైవర్ అతుల్‌తో ఈ అక్కాచెల్లెళ్లకు పరిచయం ఏర్పడింది. అతడు ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు. అలా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. పైగా ఒక్కడినే వివాహం చేసుకుంటే.. ఇక జీవితాంతం కలిసి ఉండవచ్చని భావించారు కవల అక్కాచెల్లెళు పింకీ, రింకీ. ఈ విషయాన్ని అతుల్‌కి చెప్పడం.. అతడు అంగీకరించడం జరిగింది.
ఆ తర్వాత తమ ప్రేమ గురించి తల్లితో చెప్పారు పింకీ, రింకీ. ఆమె అంగీకరించింది. ఆ తర్వాత అతుల్ తల్లిదండ్రులతో మాట్లాడి.. వారు కూడా అంగీకరించడంతో.. పెళ్లికి ఏర్పాటు చేశారు. అక అంగరంగవైభంగా ఈ వివాహ వేడుక జరిగింది. ఇక పెళ్లి సందర్భంగా అక్కాచెల్లెళ్లు ఇద్దరు అతుల్ మెడలో వరమాల వేడయానికి పోటీ పడ్డారు. ఈ దృశ్యాలు అన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. తెగ వైరలయ్యింది. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ వీడియో వైరల్ కావడంతో.. అసలు సమస్య ప్రారంభం అయ్యింది.
ఇలా ఒకేసారి ఇద్దరిని వివాహం చేసుకోవడం ఏంటి.. ఈ పెళ్లి చట్టబద్ధత, నైతికత ఏంటి అంటూ కొందరు కామెంట్స్ చేశారు. అంతేకాక ఎవరో.. అతుల్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో అక్లూజ్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 494 ప్రకారం.. కవల అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నందుకు అతుల్ మీద కేసు నమోదు చేశారు. ఈ వార్త విన్నవారు.. పాపం కంప్లైంట్ ఇచ్చిన వాడికి.. ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు అనుకుంటా.. అందుకే అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ఏం కాదు బ్రో.. అక్కాచెల్లెళ్లు ఇద్దరు నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.. ఏం కాదు భయపడకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
महाराष्ट्र के पंढरपुर में दो सगी बहनों ने एक ही लड़के से शादी की..#Viral #viralvideo pic.twitter.com/fyf3XxOzNL
— Shyamsundar Pal (@ShyamasundarPal) December 3, 2022