పెరుగుతున్న ఇంధన ధరలు, వాతావరణ కాలుష్యం ఇలా కారణాలు ఏవైనా కానీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మాత్రం జోరందుకుంటుంది. ఇది మంచి పరిణామమే అయినప్పటికి.. ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బైక్‌లు పెలిన సంఘటనలు చూశాం. పెట్రోలు ఖర్చులు భరించే స్థోమత లేక.. వీటి వైపు మొగ్గు చూపుతుంటే.. ఇవేమో పేలిపోయి జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అంతేకాక.. పెట్రోల్ వాహనాలతో పోల్చితే.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఓ సంఘటన వైరలవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. బీడ్ జిల్లాకు చెందిన సచిన్ గిట్టే, రూపాయి రూపాయి దాచి ఎంతో ఆశపడి, 2021 సెప్టెంబర్‌లో ఓలా స్కూటర్ బుక్ చేశాడు. అది మార్చి 24, 2022న డెలివరీ అయ్యింది. కొన్న ఆరు రోజులకే అది పనిచేయడం మానేసింది. వెంటనే గిట్టే.. షోరూంకు పరుగులుతీశాడు. జరిగిన విషయాన్ని అక్కడున్న సిబ్బందికి చెప్పగా, వారు మెకానిక్ వచ్చి చెక్ చేస్తారని చెప్పారట. కానీ రోజులు గడిచినా ఎవరూ రాలేదు. ఎన్నోసార్లు కస్టమర్ కేర్ ప్రతినిధులకు ఫోన్ చేసినా.. వారు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో కంపెనీకి బుద్ది చెప్పాలనుకున్న గిట్టే స్కూటర్‌ను గాడిదకు కట్టి ఊరేగింపు తీశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇది కూడా చదవండి: నానో కారును హెలికాప్టర్ గా మార్చిన వ్యక్తి!
ఎందుకు ఇలా చేస్తున్నాయవయ్యా అని స్థానికులు అడగ్గా.. కొన్న ఆరు రోజులకేబైక్ పనిచేయడం మానేసింది. వస్తువును అమ్మిన కంపెనీ నా ఆవేదనను పట్టించుకోలేదు. కంపెనీపై ఆగ్రహంతోనే తాను ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపాడట. ఓలా కంపెనీ టూవీలర్లను కొనవద్దని అతను కోరుతున్నాడు. మరి గిట్టే.. చేసిన వినూత్న నిరసనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియాజేయండి.