కరోనా కట్టడికి వ్యాక్సినే కీలక ఆయుధం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. టీకా రెండు డోసులు తీసుకుంటే.. కరోనా వచ్చినా మరణాలు ఎక్కువగా సంభవించవని ప్రచారం చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా శరవేగంగా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ పై ఇప్పటికి చాలామందికి పలు అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఔరంగాబాద్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల తన బిడ్డ చనిపోయిందని.. అందుకు బదులుగా తనకు 1000 కోట్ల రూపాయల పరిహారం ఇప్పించాల్సిందిగా ఔరంగాబాద్ కు చెందిన వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఆ వివరాలు..
ఔరంగాబాద్ కు చెందిన దిలీప్ లునావత్ అనే వ్యక్తి కుమార్తె స్నేహాల్ నాసిక్ లో మెడిసిన్ చేస్తోంది. వ్యాక్సినేషన్ మొదటి దశలోనే స్నేహాల్ టీకా వేసుకుంది. 2021, జనవరి 28 స్నేహాల్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకుంది. కానీ దాని దుష్ప్రభావల వల్ల ఆమె అదే ఏడాది మార్చి 1న మరణించింది. ఈ క్రమంలో లూనావత్.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తలెత్తిన సైడ్ ఎఫెక్ట్స్ వల్లే తన కుమార్తె చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏఈఎఫ్‌ఐ కమిటీ అక్టోబర్ 2, 2021న ఇచ్చిన నివేదికలో తెలిపినట్లు పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి : పుష్ప ఫీవర్: కరోనాపై అవగాహన కోసం ‘పుష్ప’ మీమ్ వాడుకున్న కేంద్రంఆ కమిటీ నివేదిక ప్రకారం.. తన కుమార్తె మరణానికి న్యాయం చేయాల్సిందిగా కోరుతూ బాంబే హైకోర్టులో కేసు వేశాడు. ‘‘వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితం, దాని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని స్నేహాల్ భావించింది. అంతేకాక డీసీజీఐ, ఎయిమ్స్, మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు టీకా పూర్తిగా సురక్షితం అని చెప్పడం వల్లనే నా కుమార్తెతో పాటు చాలా మంది ఆరోగ్య సిబ్బంది టీకా వేసుకున్నారని’’ లునావత్ పిటీషన్ లో తెలిపాడు.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తలెత్తిన దుష్ప్రభావాల వల్లే తన కుమార్తె మరణించిందని.. ఇందుకు గాను తనకు 1000 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాల్సిందిగా కోరాడు. మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, వ్యాక్సిన్ తయారీదారు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బిల్ గేట్స్‌ను ప్రతివాదులుగా చేసిన ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇంకా విచారణ తేదీని కేటాయించలేదు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : వ్యాక్సిన్ వద్దు బాబోయ్ అంటూ.. చెట్టెక్కిన అమ్మాయి..!