ఈ భూమ్మీద మనిషిని మించిన స్వార్థపూరిత జీవి మరొకటి ఉండదు. ప్రకృతి ఇచ్చిన వనరులన్నింటిని తను మాత్రమే వినియోగించుకోవాలనే ఆలోచన మనిషిది. తనతో పాటు ఈ భూమ్మీద ఎన్నో జీవురాశులున్నాయని.. వాటికి కూడా ఈ ప్రకృతి వనరుల మీద తనుకున్నట్లే హక్కులు, అధికారులుంటాయని గుర్తించడు. ప్రతి దాన్ని కేవలం తన స్వార్థం కోసం మాత్రమే వినియోగించుకుంటాడు. అయితే ఆ ఫలితాలు ఎంత భయంకరంగా ఉంటాయో నేడు అనుభవిస్తున్నప్పటికి మనిషి తీరు మారడం లేదు. మరీ ముఖ్యంగా మనిషి తాను తలదాచుకోవడం కోసం.. జంతువులకు నివాసమైన అటవి క్షేత్రాలను నాశనం చేస్తున్నాడు. అడవులను ఇష్టారీతిన నరికివేస్తూ.. మూగజీవాలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు.
ఫలితంగా అడవి తల్లి ఒడిలో సేదదీరాల్సిన మూగ జీవాలు.. మానవ ఆవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మనుషుల మీద దాడులు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనావాసాల్లోకి వస్తున్న పులుల సంఖ్య గత కొంత కాలంగా పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా.. చిరుత పులి ఒకటి దర్జాగాఘో ఇంట్లో ప్రవేశించి.. రెస్ట్ తీసుకోసాగింది. దాన్ని చూసిన కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ వివరాలు..
ఈ విచిత్ర సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబయి నగర పరిధిలోని సతారాలోని కోయానగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో చిరుత పులి ప్రవేశించింది. కుటుంబ సభ్యులంతా దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గామాత విగ్రహ నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకుందుకు వెళ్లారు. ఈ క్రమంలో జనావాసాంలోకి వచ్చిన చిరుత.. ఇంట్లో ప్రవేశించింది. ఇక రాత్రి ఇంటికి వచ్చిన సదరు కుటుంబ సభ్యులు.. ఇంట్లో ఓ గదిలో దర్జాగా రెస్ట్ తీసుకుంటున్న పులిని చూసి భయంతో బిక్కచచ్చిపోయారు. షాక్ నుంచి కోలుకుని.. వెంటనే బయటకు పరిగెత్తారు.
ఇక ఇంట్లోకి చిరుత పులి వచ్చిందన్న వార్త నిమిషాల్లో వైరలయ్యింది. దాంతో పులిని చూడటం కోసం ప్రజలు పెద్ద ఎత్తున.. అక్కడికి చేరుకున్నారు. కిటికీల గుండా పులిని చూస్తూ.. వీడియలో తీయసాగారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి చిరుతపులిని బోనులో బంధించి తీసుకువెళ్లారు. మొత్తం మీద ఇంట్లోకి అతిథిగా వచ్చిన చిరుతపులి బయట జనం సందడి చూసి అటు ఇటూ తిరుగుతూ ఎంజాయ్ చేయసాగింది.