మన దేశంలో అత్యధికంగా శ్రమించి.. అతి తక్కువ ఆదాయం పొందే వారిలో రైతన్నలే ముందు స్థానంలో ఉంటారు. ఆరుగాలం శ్రమించి.. పంటను కన్నబిడ్డలా భద్రంగా కాపుడుకుని.. తిన్నా, తినకపోయినా.. పంటకు పెట్టుబడి పెట్టి.. ఇక తమ శ్రమకు తగిన ఫలితం వస్తుంది అనే సంతోషించేలోపే.. అటు ప్రకృతో.. ఇటు ప్రభుత్వమో అన్నదాతలకు తీరని శోకాన్ని మిగులస్తాయి. ఇక నష్టపోయిన ప్రతి సారి.. వచ్చే ఏడాది బాగుంటుందని తనకు తానే సర్ది చెప్పుకోవడం.. మళ్లీ పంటలు వేయడం.. నష్ట పోవడం.. చివరకు అప్పుల పాలవ్వడం.. వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకోవడం.. ప్రస్తుతం అన్నదాత ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోవు.. పోని బ్యాంకులయినా.. వారికి లోన్ ఇచ్చి ఆదుకుంటాయా అంటే అది లేదు. ఇలాంటి పరస్థితుల్లో.. ఓ రైతు.. బ్యాంక్‌కు వెళ్లి ఏకంగా 6.6 కోట్ల రూపాయల లోన్ అడిగాడు. అందుకు అతడు చెప్పిన కారణం విని అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ వివరాలు..
ఈ వినూత్న సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. తక్టోడా గ్రామానికి చెందిన కైలాష్ పతంగే వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. తనకు రెండు ఎకరాల పొలం ఉంది. అయితే వర్షాలు సరిగా కురవక, చేనుకు నీరు పెట్టే పరిస్థితులు లేక చాలా ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో సమస్యల నుంచి బయట పడేందుకు కైలాష్ పతంగే వినూత్న ఆలోచన చేశాడు. దానిలో భాగంగా.. కొన్ని రోజుల క్రితం దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి లోన్‌కు అప్లై చేశాడు. తాను హెలికాప్టర్ కొనుక్కోవాలని అందుకుగాను రూ.6.6 కోట్లు కావాలని దరఖాస్తు చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: Harassment Of Woman: మహిళా మంత్రి అశ్లీల వీడియోకు ప్రయత్నం.. వ్యక్తి అరెస్ట్!
అందులో వ్యవసాయం కష్టతరంగా మారిందని పేర్కొన్నాడు. రుణం ఇస్తే హెలికాప్టర్ కనుక్కుంటానని.. దాన్ని కిరాయికి తిప్పుకుని డబ్బులు సంపాదించుకుంటానని పేర్కొన్నాడు. “నేను రెండేళ్లుగా మా భూమిలో సోయాబీన్ సాగు చేస్తున్నాను. కానీ వర్షాలు పడక దానివల్ల నాకు మంచి రాబడి రాలేదు. కనీసం పంట బీమా డబ్బులు కూడా సరిపోలేదు.” అని కైలాష్ పతంగే పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: Sangareddy: బ్యాంకులో అప్పు.. అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఊరొదిలి వెళ్లిపోయిన రైతు..!
ఈ కారణాల వల్ల కైలాష్ పతంగే ఒక హెలికాప్టర్‌ని కొనుగోలు చేసి, దానిని అద్దెకు తిప్పుకుని మంచి జీవనం సాగించాలని భావించాడు. సక్రమంగా వర్షాలు కురవకపోవడం, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏళ్ల తరబడి వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దాంతో రుణం కోసం బ్యాంకును ఆశ్రయించాడు. దీనిపై ప్రశ్నించగా ” పెద్ద వ్యక్తులు మాత్రమే పెద్ద కలలు కనాలని ఎవరు చెప్పారు..? రైతులు కూడా పెద్ద కలలు కనాలి. హెలికాప్టర్ కొనుగోలు కోసం రూ.6.6 కోట్ల రుణం కోసం నేను దరఖాస్తు చేశాను. ఇతర వ్యాపారాలలో చాలా పోటీ ఉంది, కాబట్టి నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.” అని కైలాష్ వెల్లడించాడు.
😐😐😐
–#farmer #maharashtra #loan #helicopter #news #india #laughingcolours #LC pic.twitter.com/9VR4zz9dUb— Laughing Colours (@LaughingColours) June 18, 2022
అతడి వాదన విన్న బ్యాంకు అధికారులు మూర్ఛపోయినంత పని చేశారు. కానీ అది తమ చేతుల్లో లేదని.. ఉన్నతాధికారులను సంప్రదించాలని.. పైగా అంత పెద్ద మొత్తం లోన్ ఇవ్వాలంటే.. ఎన్నో ఫార్మాలటీస్ ఉండటమే కాక.. హామీగా అంతే విలువైన ఆస్తిని బ్యాంకుకు చూపాలని తెలిపారు. లోన్ వచ్చినా రాకపోయినా.. అతడి ధైర్యాన్ని మాత్రం మెచ్చుకుంటున్నారు తోటి రైతులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: TCS: ఉద్యోగి విజయం.. TCS కంపెనీకి కోర్టులో చుక్కెదురు!