ఒక బస్సు ప్రమాదవశాత్తూ కాలువలో పడింది. ఈ దుర్ఘటన బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
రోడ్డు ప్రమాదాల్లో జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఎందరో తమ అయినవాళ్లను కోల్పోతారు. కొందరు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు తీవ్ర గాయాలపాలై కోలుకునేందుకు ఏళ్లు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటి వల్ల బాధిత కుటుంబాలకు ఎంత బాధ కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా పెద్దగా మార్పు రావడం లేదు. డ్రైవర్ల అజాగ్రత్త, నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ లాంటి పలు కారణాల వల్ల ఎక్కువ మటుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
రాయ్‌గఢ్ జిల్లాలోని ఖోపోలి దగ్గర శనివారం ఒక బస్సు ప్రమాదవశాత్తూ లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో 25 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. బస్సు లోయలో పడిన సమయంలో అందులో 40 నుంచి 45 మంది ప్రయాణికులు ఉన్నారని రాయ్‌గఢ్ జిల్లా ఎస్పీ చెప్పారు. ఈ బస్సు ప్రమాదంలో గాయపడిన 25 మందిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించామని ఎస్పీ పేర్కొన్నారు. క్రేన్ సాయంతో బస్సును బయటకు తీస్తున్నామని తెలిపారు. ఈ యాక్సిడెంట్లో బస్సు మొత్తం తీవ్రంగా దెబ్బతింది. గోరేగావ్ నుంచి పూణె వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. గోరెగావ్‌లోని ఒక సంస్థకు చెందిన వ్యక్తులు అంతా కలసి పూణెకు తిరుగు ప్రయాణం చేస్తున్నట్లు తెలిసింది.
The news of the fatal road accident in Maharashtra is deeply disturbing. My deepest condolences to the bereaved family members. I pray to God for the speedy recovery of those injured in the accident.
#BusAccident
#Rayagada
#Maharashtra pic.twitter.com/JDroU9kfWD— Duddakunta Venkateswara Reddy/వెంకటేశ్వర రెడ్డి (@DuddakuntaBJP) April 15, 2023