ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు టెక్నాలజీని వాడుకుంటున్నారు. దేశంలోని దాదాపు అన్ని వ్యవస్థలు టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాయి. పోలీసు వ్యవస్థ, ఆరోగ్య శాఖలు సాంకేతక రంగాన్ని ఉపయోగించుకుంటున్నాయి. తాజాగా భారత న్యాయవ్యవస్థ సైతం టైక్నాలజీని ఉపయోగించి చరిత్ర సృష్టించింది. న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారి.. ఓ హైకోర్టు జడ్జీ వాట్సాప్ ద్వారా కేసు విచారణ చేపట్టారు. ఇదే వింతగా ఉంటే.. ఆ విచారణ కూడా ఆదివారం నాడు చెపట్టాడు. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులో గత నెలలో తంజావూరులోని ఓ ప్రాంతం రథయాత్ర జరిగిన విషయం జరిగింది. ఈక్రమంలో విద్యుత్ తీగలకు రథం తాకగా.. ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి రాష్ట్రంలో జరిగే రథయాత్రలపై అధికారులు ఆంక్షాలు విధించారు. ఈక్రమంలో ధర్మపురి జిల్లాలోని శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో సోమవారం రథయాత్ర జరగాల్సి ఉంది. అయితే ఆ రథయాత్రను నిలిపివేయాలని స్థానిక ఎస్సై ఆదేశాలు జారీ చేశారు. దీనిని ఆలయల కమిటీ సభ్యుడు శ్రీనివాసన్ అనే వ్యక్తి కోర్టులో సవాలు చేశారు.
ఇదీ చదవండి: మామను కర్రతో కొట్టి చంపిన కోడలు! ఎందుకంటే?
ఈ కేసుపై సత్వరమే విచారణ చేపట్టాలని, రథయాత్ర నిర్వహించకపోతే.. దేవుడి ఆగ్రహంతో చెడు జరుగుతుందని పిటిషనర్ అభ్యర్థించారు. ఫలితంగా ఆదివారం ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైకోర్టు జడ్జి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ నాగర్‌కోయిల్ వెళ్లారు. అక్కడ ఉండే కేసును వాట్సాప్ ద్వారా విచారించారు. విచారణ చేయాలని పిటిషనర్ తీవ్రంగా అభ్యర్తించడంతో నాగర్‌కోయల్‌లో కూర్చుని వాట్సాప్ ద్వారా జడ్డి అత్యవసర విచారణ జరపాల్సి వస్తోంది అని జస్టిస్ స్వామినాథన్ పేర్కొన్నారు. మరి..ఈ వాట్సాప్ ద్వారా కేసు విచారించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.