బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా.. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా? అవును ఇటీవలే మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవాలో ఓ పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో అక్కడ టాయిలెట్ అశుభ్రంగా ఉందని భావించిన ఎంపీ జనార్దన్ మిశ్రా.. వెంటనే ఒట్టి చేతులతో ఆ టాయిలెట్ సీట్‌ని శుభ్రం చేశారు. సెప్టెంబర్ నెలలో ఇది పెద్దఎత్తున వైరల్‌గా మారింది. ఎంపీ చేసిన పనికి అంతా అవాక్కయ్యారు. ఇప్పుడు అదే ఎంపీ సార్ మరో షాకిచ్చారు. ఈసారి బీజేపీ ఎంపీ జనార్దన్ చేతలతో కాకుండా.. మాటలతో రెచ్చిపోరు. ఏకంగా ప్రజలకు గుట్కాలు తినండి, మందు తాగండి, గంజాయి సేవించండి, థిన్నర్ పీల్చండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రేవా కృష్ణరాజ్ కపూర్ ఆడిటోరియంలో నీటి సంరక్షణకు సంబంధించిన వర్క్ షాప్ లో పాల్గొన్నారు. నీటి ఆవశ్యకత, దానిని ఎలా రక్షించుకోవాలి అంటూ ఎంపీ చాలా బాగా మాట్లాడారు. కానీ, చివర్లో ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారినే కాదు.. యావత్ దేశాన్నే నోరెళ్లబెట్టేలా చేశారు. “నీళ్లు లేక భూములు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు ఇంకి పోతున్నాయి. నీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కావాలంటే గుట్కా తినండి లేదా మందు తాగండి.. గంజాయి తాగండి, థిన్నర్ పీల్చండి కానీ నీటికి ఉన్న ఆవశ్యకతను, అవసరాన్ని తెలుసుకోండి” అంటూ ఎంపీ జనార్దన్ మిశ్రా వ్యాఖ్యానించారు.
Bjp mp Janardhan mishra cleans toilet with his own hands during a visit to school in Rewa(mp). pic.twitter.com/DRU9xCkDGH
— Nomula srinivas (@Nomulasrinivas4) February 18, 2018
ఎంపీ జనార్దన్ మిశ్రా అక్కడితో ఆగలేదు.. రేపు ఎప్పుడన్నా ఏ ప్రభుత్వమైనా వచ్చి నీటి మీద పన్ను మాఫీ చేస్తామని చెబితే.. వాళ్లకు ఒక్కటే చెప్పండి. మేము నీటి పన్నునే చెల్లిస్తాం. కావాలంటే మీరు మిగిలిన పన్నులను మాఫీ చేయండి అని డిమాండ్ చేయాలంటూ సలహాలు కూడా ఇచ్చారు. అయితే ఎంపీ జనార్దన్ మిశ్రా ఇచ్చిన ఈ ఉచిత సలహాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ.. ప్రజాప్రతనిధిగా మీరు ప్రజలకు ఇచ్చే సలహాలు, సూచనలు ఇవేనా అంటూ తీవ్ర ఆహ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, యువకులను గుట్కా తినండి, మందు తాగండి అని ఎలా చెబుతారంటూ కన్నెర్రజేస్తున్నారు. కొందరైతే ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
#WATCH | Rewa, Madhya Pradesh: “Lands are running dry of water, it must be saved… Drink alcohol, chew tobacco, smoke weed or smell thinner and solution but understand the importance of water,” says BJP MP Janardan Mishra during a water conservation workshop pic.twitter.com/Nk878A9Jgc
— ANI (@ANI) November 7, 2022