పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితంలో ఒక్కసారే పెళ్లి చేసుకుంటాం.. ఆ మధుర క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తుంటారు. అందుకే ఈ మద్య ప్రీ వెడ్డింగ్ మొదలు వివాహం అయ్యేవరకు చాలా గ్రాండ్ గా తమ స్థాయికి తగ్గట్టలు ప్లాన్ చేస్తున్నారు. ఇక బారాత్ లో డీజే సౌండ్ తో దుమ్మురేపుతున్నారు.
జీవితంలో వివాహం అనేది ప్రతి ఒక్కరికీ మధురమైన ఘట్టం. వేద మంత్రాల సాక్షిగా.. బంధుమిత్రుల ఆశీర్వాదంతో తమ భాగస్వామితో నిండు నూరేళ్లు పిల్లా పాపలతో జీవించాలనేది పెళ్లి ముఖ్య ఉద్దేశం. అందుకే అబ్బాయి, అమ్మాయి పెళ్లిని తమ జీవింతో ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉండాలని కోరుకుంటారు. ఈ మద్య ప్రీ వెడ్డింగ్ నుంచి వివాహం జరిగే వరకు చాలా గ్రాండ్ గా జరుపుతున్నారు. కొంత మంది అయితే వివాహాలు భూమి మీదే కాదు.. ఆకాశం, సముద్ర గర్భంలో జరుపుకుంటున్నారు. ఇక పెళ్లైన తర్వాత బారాత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన దేశంలో అయితే బారాత్ అంటే ధూం.. ధాం గా డీజే సౌండ్ తో దుమ్మురేపుతుంటారు. తాజాగా పెళ్లి బారాత్ జరుగుతున్న సమయంలో పోలీసులు ఎంట్రీ పెళ్లి బృందానికి షాక్ ఇచ్చారు. దాంతో కొత్త జంట స్టేషన్ ముందు ధర్నా చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.
మధ్యప్రదేశ్ రత్లామ్ లో రైల్వే కాలనీకి చెందిన అజయ్ సోలంకి అనే యువకుడికి కోమలి అనే యువతితో బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఇక పెళ్లిలో బంధువులు, స్నేహితులు నానా హంగామా చేశారు. పెళ్లయిన తర్వాత భారీ ఊరేగింపు ఏర్పాట్లు చేశారు. ఇక బారాత్ అంటే మన దేశంలో ఏ రేంజ్ లో చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. డీజే సౌండ్స్ తో చెవులు తూట్లు పడేలా సౌండ్ పెట్టి ఆడా మగా అనే తేడా లేకుండా డ్యాన్స్ తో ఊగిపోతుంటారు. అజయ్ సోలంకి బారాత్ లో కూడా డీజే సౌండ్ ఏర్పాటు చేసి ఊరేగింపుగా వెళ్తున్నారు. అయితే డీజే సౌండ్ తో రాత్రి పూట చుట్టుపక్కల జనాలకు పిచ్చెక్కిపోయింది.
డీజే సౌండ్ భరించలేని కొంత మంది స్థానికులు పెళ్లి బృందం వద్దకు వచ్చి కాస్త సౌండ్ తక్కువ పెట్టుకోండీ అని చెప్పారు. పెళ్లి జోష్ లో ఉన్నవాళ్లంతా అవేవీ పట్టించుకోకుండా కాస్త సౌండ్ పెంచి మరీ డ్యాన్స్ వేయడం మొదలు పెట్టారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పెళ్లి బారాత్ వద్దకు వచ్చి డీజే సౌండ్ ని ఆపించారు. దాంతో పోలీసులకు, పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులకు మద్య గొడవ మొదలైంది. అయితే పోలీసులు కొంతమంది తాగి వచ్చి ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులపై విరుచుకుపడ్డారు. జీవితంలో ఒక్కసారే పెళ్లి చేసుకుంటాం.. ఆ ఒక్కరోజు కూడా ఆనందంగా ఉండొద్దా? మేం ఆపే ప్రసక్తి లేదు అని ఏన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి.. జైలుకు పంపిస్తారా పంపండి.. మేం కోర్టుకు వెళ్తాం అంటూ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పెళ్లి బట్టలతోనే స్టేషన్ ముందు ధర్నా చేశారు. దీంతో పెళ్లి బృందానికి పోలీసులు తమదైన శైలిలో సర్ధిచెప్పి పంపించారు.