ప్రేమ ఈ పదానికున్న శక్తి, గొప్పదనం అంతా ఇంతా కాదు. ప్రేమ కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. మనిషిని అందనంత ఎత్తులో నిలిపేది.. పాతాళానికి తొక్కే శక్తి ప్రేమకుంది. ప్రేమను దక్కించుకోవడం కోసం కొందరు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధం అవుతారు. మరి కొందరు విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని వల్ల ప్రేమ సఫలం సంగతి దేవుడెరుగు కానీ.. జీవితాలు నాశనం అవుతాయి. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ భోపాల్ లో చోటు చేసుకుంది. ప్రేమించిన యువతితో కలిసి ఉండేందుకు ఓ యువకుడు తన పుట్టుకను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అతడి ప్రవర్తనపై తల్లిదండ్రులకు అనుమానం రావడంతో.. వారు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఆ వివరాలు..
మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన ఓ యువకుడు ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు కంపెనీలో తనతో పాటు పని చేస్తున్న ఓ మహిళను ప్రేమించాడు. అయితే ఆమెకు అప్పటికే వివాహం అయ్యి.. భర్త మరణించాడు. ఈ విషయం తెలిసినప్పటికి యువకుడు ఆమెను ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తన ఆలోచనను ఆమెకు తెలియజేశాడు. అయితే సదరు మహిళ అతడి ప్రేమను నిరాకరించింది. మరణించిన భర్త తనను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడని.. అతడిని తప్ప మరేవరినీ భర్తగా చూడలేనని.. జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోనని తెలిపింది.
ఇది కూడా చదవండి : ఆ రైతు ఖాతాలోకి 15 లక్షలు.. మోదీ ఇచ్చారనుకుని ఇల్లు నిర్మాణం!అయితే ఎలాగైనా ప్రేమించిన మహిళతో కలిసి జీవించాలని భావించిన యువకుడు.. తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా తన పుట్టుకనే మార్చుకోవాలని భావించాడు. ఆడపిల్లగా మారితే.. తన లవర్ తో కలిసి ఉండేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. జీవితాంతం ఆమెతో కలిసి బతకొచ్చని భావించి.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఓ వైద్యుడిని సంప్రదించి.. తన ఆలోచన చెప్పాడు. అమ్మాయిగా మారాలని.. కోరాడు. అతడి అభ్యర్థనకు అంగీకరించిన డాక్టర్ అతడికి చికిత్స చేయడం ప్రారంభించాడు. ట్రీట్‌మెంట్ లో భాగంగా నెల రోజులుగా అతడు మందులు వాడుతున్నాడు. ఫలితంగా అతడి శరీరంలో ఎవరు ఊహించని మార్పలు వచ్చాయి. అమ్మాయిలా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.
కుమారుడి ప్రవర్తనలో మార్పు పసిగట్టిన తల్లిదండ్రులు.. అతడిని కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సదరు యువకుడు అసలు విషయాన్ని వెల్లడించారు. ప్రేమించిన యువతితో కలిసి ఉండేందుకు అమ్మాయిలా మారే చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఇక తల్లిదండ్రులు, కౌన్సిలర్ మాటలతో సదరు యువకుడు తన నిర్ణయాన్ని మార్చుకుని.. చికిత్సను నిలిపేశాడు. ప్రారంభంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.. పూర్తిగా మహిళగా మారితే పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : కరోనాతో స్నేహితుడి మృతి.. ఆ వ్యక్తి చేసిన పనికి అందరూ ఫిదా