భార్యభర్తలు, ప్రేమికులు, స్నేహితులు.. ఇలా ఏ బంధం.. కొనసాగాలన్నా.. కలకలం నిలవాలన్నా.. నమ్మకం ముఖ్యం. మిగతావన్ని ఆ తర్వాతే. మరీ ముఖ్యంగా భార్తాభర్తల మధ్య.. నమ్మకం పునాదిగా ఉండాలి. ఇద్దరి మధ్య ఎలాంటి రహాస్యాలు ఉండకూడదు. ఇదే విషయాన్ని నమ్మింది ఓ నవ వధువు. అందుకే తమ దాంపత్య జీవితాన్ని ప్రారంభించబోయే తొలిరాత్రే.. భర్తకు తన జీవితంలో చోటు చేసుకున్న దారుణం గురించి వెల్లడించింది. తన మీద నమ్మకంతో నిజం చెప్పిన భార్యను అర్థం చేసుకోకుండా.. సదరు వ్యక్తి ఆమెను పుట్టింటిలో వదిలేసి.. విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. మూడేళ్ల తర్వాత కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ఇంతకు ఆ మహిళ జీవితాన్ని నాశనం చేసిన ఆ నిజం ఏంటో తెలియాలంటే ఇది చదవండి..
ఇది కూడా చదవండి: విడాకులు తీసుకున్న రోజే మరో పెళ్లి.. ఆ నేత తీరుపై విమర్శలు
మధ్యప్రదేశ్, గ్వాలియార్‌కు చెందిన ఇద్దరు యువతీ, యువకులకు వివాహం 2016లో వివాహం అయ్యింది. ఫస్ట్‌నైట్ రోజు రాత్రి.. మహిళ.. గతంలో తనపై మేనమామ కుమారుడు అత్యాచారం చేశాడనే భయంకరమైన నిజాన్ని భర్తకు తెలిపింది. ఆమె మాటలతో షాక్‌కు గురైన భర్త.. మరుసటి రోజే ఆమెను పుట్టింట్లో విడిచిపెట్టి.. తన ఇంటికి వెళ్లిపోయాడు. కారణం అడిగితే.. ఆమెపై గతంలోనే అత్యాచారం జరిగిందని.. అలాంటి వ్యక్తి తనకు భార్యగా వద్దని తేల్చి చెప్పాడు. అప్పటి వరకు బాధితురాలి తల్లిదండ్రులకు కూడా ఈ దారుణం గురించి తెలియదు.
ఇది కూడా చదవండి: మాజీ ఎమ్మెల్యే భార్య మంచి మనసు.. కోట్ల విలువైన ఆస్తి విరాళం!
అనంతరం సదరు వ్యక్తి భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ.. కోర్టును ఆశ్రయించాడు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కోర్టుకు హాజరుకావాల్సిందిగా సదరు మహిళకు నోటీసులు పంపింది. ఎన్ని సార్లు నోటీసులు పంపినా.. సదరు మహిళ స్పందించకపోవడంతో.. మూడేళ్లపాటు సాగిన విచారణను ముగిస్తూ.. ఇటీవలే కోర్టు తీర్పు ఇచ్చింది. సదరు వ్యక్తి కోరినట్లు.. భార్య నుంచి విడాకులు మంజూరు చేసింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: స్టార్ హీరోయిన్ విడాకుల ప్రకటన.. ఆ పనే కొంపముంచిందా?