అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. అది ఎప్పుడు ఏ విధంగా తలుపు తట్టినా.. ఆ టైంలో లైఫ్ మారిపోవడం ఖాయం. ప్రతిరోజూ ధనికుల నుండి సామాన్యుల వరకూ అందరూ వారి అదృష్టాలను పరీక్షించుకుంటూనే ఉంటారు. వారిలో అదృష్టం వరించేది కొందరినే. తాజాగా అదృష్టం తలుపు తట్టి ఓ మహిళ జీవితం మారిపోయింది. వజ్రాల గనిలో పని చేసుకుంటున్న ఆ మహిళకు ఖరీదైన వజ్రం లభించింది. ఆ వజ్రం ఖరీదు దాదాపు రూ. 10 లక్షలపైనే ఉంటుందని అంచనా. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ వజ్రం లభించిన అదృష్టవంతురాలు ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లా.. ఇత్వాకల గ్రామంలో చమేలీ బాయి, అరవింద్ సింగ్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవల కృష్ణ కళ్యాణ్పుర్ పాటి అనే ప్రాంతంలో వజ్రాల గనిని లీజుకు తీసుకుని.. మార్చిలోనే మైనింగ్ ప్రారంభించారు. ఈ క్రమంలో.. లీజుకు తీసుకున్న గనిలో తాజాగా చమేలీ బాయికి 2.08 క్యారెట్ల వజ్రం లభించింది. అంతే ఆ రాత్రికి రాత్రే చమేలీ బాయి, అరవింద్ సింగ్ ల లైఫ్ మారిపోయింది. మంగళవారం గనిలో దొరికిన విలువైన వజ్రాన్ని పన్నా డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశారు చమేలి బాయి దంపతులు. ఆ తర్వాత వజ్రం నాణ్యతను పరీక్షించిన అధికారులు దాని విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
దీనితో విషయం తెలిసిన చమేలీ బాయి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. దొరికిన వజ్రానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ధర నిర్ణయించి త్వరలో వేలం వేస్తారు. వేలంలో వచ్చిన ధర నుంచి పన్నులు, రాయల్టీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని చమేలీ బాయి దంపతులకు అందజేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకే వజ్రాల గనిని లీజుకు తీసుకున్నామని చెప్పిన చమేలీ బాయి.. వేలం డబ్బులు వచ్చాక పన్నా నగరంలో కొత్త ఇల్లు కొనుక్కుంటామని చెప్పుకొచ్చింది. ఆ విధంగా మొత్తానికి చమేలీ బాయి దంపతుల లైఫ్ ను ఓ వజ్రం మార్చేసింది. మరి అదృష్టవంతులుగా మారిన ఈ చమేలీ బాయి దంపతుల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.