ఈ మద్య మనుషులు డబ్బు కోసం దేనికైనా సిద్ద పడుతున్నారు. ఎదుటి వారి ప్రాణాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా చంపేస్తున్నారు.. తాజాగా మధ్యప్రదేశ్‌లోని దారుణ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత కొంత కాలంగా సాగా బర్ఖెడ అటవీ ప్రాంతంలో కొంత మంది వేటగాళ్లు కృష్ణ జింకను వేటాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులకు వేటగాళ్ళకు మద్య భీకరంగా కాల్పులు జరిగాయి. వేటగాళ్ళు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించారు. కాల్పుల్లో సబ్-ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్ జాతవ్, హెడ్ కానిస్టేబుల్ సంత్ రామ్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ లు ఉన్నారు.
గత కొంత కాలంగా అడవిలో వేటగాళ్లు కృష్ణ జింకలను వేటాడుతున్నట్లుగా పక్కా సమాచారం అందడంతో ఈ విషయం పై పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. అడవిలో వేటగాళ్లు సంచరిస్తున్నారన్న విషయం తెలియగానే సాగా బర్ఖెడ గ్రామ పరిధిలో తనిఖీలు చేస్తున్న పోలీసులపై అకస్మాత్లుగా వేటగాళ్లు కాల్పులు జరిపారు. వేటగాళ్ల వద్ద అత్యాధునిక ఆయుధాలు ఆయుధాలు ఉండటం వరుసగా కాల్పులు జరిపారారని పోలీసులు తెలిపారు.
ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించినట్లుగా.. వారిని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన నివాసంలో 9.30 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. డీజీపీ, హోం మంత్రి సహా సీనియర్ పోలీసు అధికారులు, ప్రధాన కార్యదర్శి తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఈ ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.