బాగా చదివే విద్యార్థులను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటాయి. బాగా చదివే స్థాయి ఉన్నా కూడా ఆర్థిక స్థాయి లేని వారిని ప్రభుత్వాలు ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తుంటాయి. ఈ క్రమంలో స్టూడెంట్స్ కి ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించనుంది.
ఈ దేశంలో ఉన్న ప్రతీ ఒక్క బిడ్డకీ విద్య అందించాలన్న లక్ష్యంతో ఇప్పటికే ఆయా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం అయితే పిల్లలందరూ చదువుకోవాలన్న లక్ష్యంతో అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను ప్రోత్సహించేందుకు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి. బాగా చదివితే స్కాలర్ షిప్ లు కూడా ఇస్తున్నాయి. అదే సమయంలో ఆడపిల్లలకు చదువు ఎంత ముఖ్యమో తెలిపేలా వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు నడుం బిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే బాగా చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించే పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఇంటర్ లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఇంటర్ చదివే విద్యార్థినులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫస్ట్ క్లాస్ లో పాసయ్యే ఇంటర్ అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించనున్నారు. ముఖ్యమంత్రి బాలిక స్కూటీ యోజన పథకం కింద ఎవరైతే ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు తెచ్చుకుంటారో వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వనున్నారు. 2023-2024 ఏడాది బడ్జెట్ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు బాగా చదివే విద్యార్థినులను ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇంటర్ చదివే విద్యార్థినులకు, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినులకు ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయితే అత్యధిక మార్కులు సాధించిన అమ్మాయిలు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం కింద రాష్ట్రంలో ఉన్న 5 వేల పాఠశాలలు ప్రయోజనం పొందనున్నాయి. మొత్తానికి ఆడపిల్లలను చదువు విషయంలో ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. అసలే నార్త్ ప్రాంతంలో ఆడపిల్లలకు చదువు ఎందుకు అన్నట్టు వ్యవహరిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.