కొంతమంది నాణేలు, పిన్నులు, చిన్న చిన్న ఇనుప వస్తువులు తినడం లేదా మింగడం లాంటివి చేస్తుంటారు. కొంతకాలం తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లడం చికిత్స చేయించుకోవడం లాంటివి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో సెల్ ఫోన్ మింగిన వారు కూడా ఉన్నారు.
ఈ మద్య చాలా మంది క్షణికావేశంలో తీసుకునే దారుణమైన నిర్ణయాలతో బంగారు భవిష్యత్ ని నాశనం చేసుకుంటున్నారు. చిన్న విషయాలకే మనస్థాపానికి గురై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు ఆ నిర్ణయాల వల్ల ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. ఒక చిన్న గొడవ కారణంగా తమ్ముడిపై కోపంతో అక్క సెల్ ఫోన్ మింగేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా కొంతమంది నాణేలు, పిన్నులు, చిన్న చిన్న ఇనుప వస్తువులు తినడం లేదా మింగడం లాంటివి చేస్తుంటారు. కొన్నిసార్లు సెల్ ఫోన్ మింగిన ఘటన కూడా ఉన్నాయి. తాజాగా అక్క, తమ్ముడి మద్య జరిగిన గొడవ కారణంగా క్షణికావేశంలో అక్క ఏకంగా సెల్ ఫోన్ మింగేసింది. మధ్యప్రదేశ్ లోని భింద్ లో అను అనే 18 ఏళ్ల యువతి.. తన సోదరుడితో సెల్ ఫోన్ కోసం గొడవ పడింది. ఇద్దరి మద్య వాగ్వాదం పెరిగిపోయింది. అయితే గొడవకు కారణం అయిన సెల్ ఫోన్ ని తీసుకొని యువతి మింగేసింది. దీంతో కుటుంబంలో అందరూ ఒక్కసారే షాక్ అయ్యారు. కొద్ది సేపటి తర్వాత అను కి తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో వెంటనే గ్వాలియర్ లోని జయరోగ్య ఆస్పత్రికి తరలించారు.
హాస్పిటల్ లో యువతికి ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. దాదాపు రెండు గంటల పాటు కష్టమైన శస్త్ర చికిత్స విజయవంతంగా సెల్ ఫోన్ బయటకు తీశారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్బంగా డాక్టర్ కుష్వాహా మాట్లాడుతూ.. ఇలాంటి కేసు నా కెరీర్ లో ఎప్పుడూ చూడలేదు.. రెండు దశాబ్ధాల అనుభవం ఉన్న నాకే ఈ కేసు చాలా కష్టతరంగా అనిపించింది.. చిన్న పిల్లలకు సెల్ ఫోన్లు దూరంగా ఉంచాలి.. పిల్ల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారు క్షణికావేశంలో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది’ అని అన్నారు.