తల్లిదండ్రులు.. తమ పిల్లలు బాగా చదువుకుని.. మంచి ఉద్యోగం సంపాదించి.. జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. తాము అందుకోలేని.. విజయాలను, లక్ష్యాలను తమ పిల్లలు సాధించాలని కోరుకుంటారు. ఇక మరి ఆ తల్లిదండ్రులు కోరుకున్నట్లే.. పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించి.. కోట్లలో వేతనం అందుకుంటూ ఉండి.. సడెన్‌గా మాకు ఈ జీవితం వద్దు.. మేం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాలనుకుంటున్నాం.. సన్యాసం తీసుకుంటామంటే.. తల్లిదండ్రులు ఏమాంటారు.. వద్దు అంటారు. కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం.. కొడుకు నిర్ణయాన్ని ఆమోదించి.. ఆశీర్వదించారు. మరి ఈ సంఘటన ఎక్కడ జరిగింది..అంటే
ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. విదేశాల్లో డాటా సైంటిస్ట్‌గా ఉద్యోగం చేస్తూ.. కోట్ల రూపాయల వేతనం అందుకుంటున్న ఓ యువకుడు.. అహింసా మార్గంలో నడవాలని భావించి.. సన్యాసం తీసుకోబోతున్నాడు. అతడే ప్రన్‌సుఖ్ కాంతేడ్.. వయసు 28 సంవత్సరాలు. దేవాస్ జిల్లా హతిపిపాలియాకు చెందిన ప్రన్‌సుఖ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి.. ఆరు సంవత్సరాల క్రితం.. అనగా 2016లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ ఎంఎస్ పూర్తిచేసిన తర్వాత.. ప్రన్‌సుఖ్ భారీ వేతనంతో డాటా సైంటిస్ట్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఇక ఏడాదికి రూ.1.25 కోట్ల వేతనం అందుకుండేవాడు.
అయితే అమెరికాలో ఉద్యోగం.. కోట్ల రూపాయల వేతనం.. ఇవేవి ప్రన్‌సుఖ్‌కి సంతృప్తి ఇవ్వలేదు. తాను వెళ్లాల్సిన మార్గం ఇది కాదని భావించేవాడు. నిత్యం ఏదో అసంతృప్తి అతడిని వెంటాడేది. అసలు తన జీవితం ఏంటి.. ఎటు వైపుగా తన అడుగులు పడాలి అనుకుంటున్నాడు.. అన్న విషయాల గురించి ఆలోచించగా.. అతడికి సమాధానం దొరికింది. ఉరుకులు పరుగుల ఆడంబర జీవితాన్ని వదిలి.. నిరాండంబరంగా గడపాలనే నిర్ణయానికి వచ్చాడు. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి.. జైన సన్యాసిగా మారాలని నిశ్చయించుకున్నాడు. దీని గురించి తల్లిదండ్రులతో చర్చించి వారి ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశంతో.. గతేడాది జనవరిలో అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చేశాడు. తల్లిదండ్రులకు తన నిర్ణయం గురించి చెప్పడంతో.. వారు కూడా అందుకు అంగీకరించారు.
డిసెంబరు 26న జినేంద్ర ముని వద్ద.. ప్రన జైన సన్యాస దీక్ష తీసుకోకున్నాడు మన్‌సుఖ్. ఈ కార్యక్రమానికి 53 మంది జైన సాధువులు హాజరుకానున్నారు. అదే రోజు ప్రన్‌సుఖ్‌తో పాట మేనమామ కుమారులైన ప్రియాన్షు తాండ్లా, పవన్ కశ్వాలు కూడా సన్యాస దీక్ష తీసుకోబోతున్నారు. తమ కుమారుడు జైన సన్యాసి కాబోతుండటం పట్ల ప్రన్‌సుఖ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. అయితే, ప్రన్‌సుఖ్‌కు చిన్నప్పటి నుంచే జైన సాధువుగా మారాలనే కోరిక బలంగా ఉండేదని అతడి తల్లిదండ్రులు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
అంతేకాక అతడికి 15 ఏళ్ల వయసు వచ్చేసరికే.. శ్వేతంబర జైన మునిగా మారాలని నిర్ణయించుకున్నాడని ప్రన్‌సుఖ్ తల్లిదండ్రలు వెల్లడించారు. కానీ, తమ కోరిక ప్రకారం ఉన్నత చదువులు చదివి… కొన్నాళ్లు ఉద్యోగం చేశాడని పేర్కొన్నారు. దాదాపు నాలుగున్నరేళ్లు అమెరికాలో ఉండి.. ఎంఎస్ చదివి.. ఉద్యోగం చేసి.. 2021లో ఇండియా వచ్చాడని తెలిపారు.
ప్రన్‌సుఖ్.. కుటుంబం ప్రస్తుతం ఇండోర్‌లో ఉంటుంది. ఈ క్రమంలో అతడి సన్యాస దీక్ష కార్యక్రమాన్ని స్వగ్రామం హతపిపియాలలో నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. గతంలోనూ పలువురు యువకులు, యువతులు.. ఇలా సన్యాసి దీక్షను స్వీకరించిన విషయం తెలిసిందే. మరి కోట్ల రూపాయల జీతం లభించే ఉద్యోగం వదులుకుని మరి సన్యాసిగా మారుతున్న ప్రన్‌సుఖ్ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.