కాలం కొన్ని గాయాలను చేస్తుంది. దెబ్బతిన్న ఆ సమయంలో కాస్త ఓర్పు, సహనం పాటిస్తే చాలు.. కాలమే ఆ దెబ్బలకి మందు రాస్తుంది. ఈ విషయాన్ని ఋజువు చేసిన, చేస్తున్న ఓ ఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ ఏడాది జూలై 30న లక్నోలోని కృష్ణానగర్ ఏరియాలో క్యాబ్ డ్రైవర్ సాదత్ అలీ, ప్రియదర్శిని అనే అమ్మాయి మధ్య జరిగిన సంఘటన అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్ తప్పు లేకపోయినా.. ప్రియదర్శిని అతనిని చెప్పుతో నాన్‌స్టాప్‌గా 22 చెంపదెబ్బలు కొట్టింది. ఈ విషయం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఆ క్యాబ్ డ్రైవర్ సాదత్ అలీ చూపించిన ఓర్పుకి అతనికి దేశం అంతా అండగా నిలిచింది. అయితే.. ఇప్పుడు ఆ మ్యాటర్ దేనికి అంటారా?
అప్పుడు యువతి చేతిలో చెంపదెబ్బలు తిన్న క్యాబ్ డ్రైవర్ ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు.ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ లోహియాలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నా అతను ప్రకటించాడు. నేను ఆ యువతి చేతిలో తిన్న 22 చెంపదెబ్బలు మరిచిపోలేదు. సమాజంలో మగవారికి కూడా న్యాయం చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నాను అంటూ ఆయన ప్రకటించాడు. మరి ఈ ఎన్నికల్లో సాదత్ అలీ గెలుస్తాడా? మగ సమాజం సాదత్ అలీని ఎమ్మెల్యేగా గెలిపిస్తుందా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.