సామాన్యులు ఏదైనా కొనాలంటే చాలు భయపడుతున్నారు. ఇంట్లో నిత్యావసరాల దగ్గర నుంచి పెట్రోల్, డీజిల్ వరకు అన్నింటి రేట్లు పెరిగిపోయాయి. గ్యాస్ ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. అయితే ఈమధ్య సిలిండర్ల ధరలు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లను వినియోగించే వారికి మరోసారి భారీ ఊరట లభించింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంచి నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం మార్పులు చేయలేదు. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1,133 దగ్గర స్థిరంగా ఉంది. అదే టైమ్లో కమర్షియల్ సిలిండర్ ధర మాత్రం రూ.1,856 వద్ద నుంచి రూ.1,773కి తగ్గింది.
మునుపటితో పోలిస్తే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.83 తగ్గినట్లు తెలుస్తోంది. ప్రతి నెల మాదిరిగానే జూన్ 1న కూడా గ్యాస్ ధరలను సమీక్షించిన చమురు కంపెనీలు.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ రేట్లను మాత్రం తగ్గించలేదు. సామాన్య ప్రజానీకం ఎక్కువగా వాడే ఈ సిలిండర్ ధరలను తగ్గిస్తే ఎంతో బాగుండేదని విశ్లేషకులు అంటున్నారు. కాగా, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఈమధ్య కాలంలో క్రమంగా తగ్గుతుండటాన్ని గమనించొచ్చు. మే నెలలో అయితే ఈ సిలిండర్ల ధరలు ఏకంగా రూ.172 మేర దిగి వచ్చాయి. ఆ లెక్కన నెల రోజుల్లో ఈ సిలిండర్ల ధరలు రూ.250 మేర తగ్గాయని చెప్పొచ్చు. ఇక, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ సిలిండర్ ధర రూ.1,116గా, హైదరాబాద్లో రూ.1,115గా ఉంది.
Commercial LPG cylinder prices slashed by Rs 83.5; domestic unchanged
Read more @ANI Story | https://t.co/YIxO7gsomQ#LPG #cylinder #PriceDrop #GasPrices #CylinderPrices pic.twitter.com/QzZu8miYpM
— ANI Digital (@ani_digital) June 1, 2023