ఇద్దరి యువతీయువకుల మధ్య చిగురించిన స్నేహం కొన్ని రోజులకు అది ప్రేమగా మారుతుంది. దీంతో ఒకరంటే మరొకరికి విడిచి ఉండలేనంత కలిసిపోతారు. దీంతో ఎలాగైన పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ తదనంతర పరిణామాల మధ్య వస్తున్న మార్పులతో ఎంతో మంది ప్రేమికులు చివరికి విగతజీవులుగా దర్శనమిస్తున్నారు. ఇక ఇలాంటి విషాద ఘటనే తాజాగా కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..ధనీష్(24), అభిరామి(20) ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. ఒకరంటే ఒకరికి విడిచి ఉండలేనంతగా కలిసిపోయారు. చివరికి వీళ్లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం మాత్రం బలంగా తీసుకున్నారు. దీంతో ఇరు తల్లిదండ్రులను ఇద్దరిని ఒప్పించారు. మొదట్లో నిరాకరించిన ఆ తర్వాత అంగీకరించారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి అంతా సిద్దం చేశారు. ఇక ఇటీవల ఇద్దరు కలిసి కుమిలీ పట్టణంలోని ఓ లాడ్జిలోకి దిగారు.
కానీ ఇక్కడే కథ వీరి జీవితానికి ఎండ్ కార్డ్ పలికింది. ఏంటంటే..? లాడ్జ్ లో కలిసి ఉన్న వీళ్లు ఓ అనుకోని నిర్ణయాన్ని తీసుకుని కన్న తల్లిదండ్రులను కన్నీటి శోకాన్ని మిగిల్చిపోయారు. ఇక ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ చివరికి అదే రూంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక వీరి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన తాజాగా ఇరు కుటుంబాల్లో విషాదం మారింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.