నేటి సమాజంలో మృత్యువు ఏ వైపు నుంచి దూసుకొస్తుందో చెప్పడం కష్టం అవుతోంది. ఇక రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వాహనదారుల అతివేగం కారణంగా అభం శుభం తెలియని అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఓ హోటల్ బయట బైక్ పై కూర్చున్న వ్యక్తిపైకి వేగంగా దూసుకొచ్చింది ఓ లారీ. లారీ వేగానికి బైక్ ధ్వంసం అయ్యింది. సినిమాని తలపించే ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
అది కర్ణాటకలోని తుమకూరు జిల్లా కునిగల్ తాలుకాలో ఉన్న అంచెపాళ్యలో ఓ యువకుడు హోటల్ ముందు బైక్ ఆపాడు. ఆ యువకుడు బైక్ కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇంతలోనే అతడి వైపు అదుపుతప్పి వేగంగా దూసుకొచ్చింది ఓ లారీ. దాంతో లారీని గమనించిన ఆ వ్యక్తి క్షణాల వ్యవధిలో తప్పించుకుని తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఆ లారీ సరాసరి యువకుడి బైక్ ను ఢీ కొట్టింది. దాంతో బైక్ తునాతునకలు అయ్యింది. అంతటితో ఆగని ఆ లారీ.. ముందుకు దూసుకెళ్లీ కొంత దూరంలో ఆగింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఎంతో చాకచక్యంగా ప్రాణాలతో బయటపడ్డాడు ఆ యువకుడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనై పరిగెత్తుకొచ్చారు.
ఇక ప్రమాదానికి కారణం అయిన లారీ బెంగళూరు నుంచి హసన్ కు వెళ్తోందని తెలుస్తోంది. ఈ ఘటనపై యువకుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ సిన్స్ కు ఏమాత్రం తీసిపోదు ఈ సీన్ అని కొందరంటే.. నీకు భూమ్మిద నూకలున్నాయి భయ్య అని మరికొందరు కామెంట్స్ చేస్తుంటే.. అదృష్టవంతుడివి బ్రదర్ ప్రాణాలతో బయటపడ్డావు అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
— Hardin (@hardintessa143) February 8, 2023