దేశ విభజన మత ప్రాతిపదికన జరిగింది. పాకిస్తాన్, భారత్ దేశం కింద విడిపోయాయి. ముస్లింలు పాకిస్తాన్ వెళ్లేందుకు, హిందువులు భారత్‌లో ఉండేందుకు సిద్ధమయ్యారు. కానీ ఈ విభజన సమయంలో నరమేధమే జరిగింది. అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిర్వాసితులు అయ్యారు. కొన్ని కుటుంబాలు చెల్లాచెదురు అయ్యాయి.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆనందం ఎంత సేపు మిగల్లేదు. ఆ తర్వాత దేశ విభజన మొదలైంది. మత ప్రాతిపదికన విభజన జరిగింది. పాకిస్తాన్, భారత్ అంటూ రెండు దేశాలుగా విడిపోయాయి. ముస్లింలు పాకిస్తాన్ వెళ్లేందుకు, హిందువులు భారత్‌లో ఉండేందుకు సిద్ధమయ్యారు. కానీ ఈ విభజన సమయంలో నరమేధమే జరిగింది. అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిర్వాసితులు అయ్యారు. కొన్ని కుటుంబాలు చెల్లాచెదురు అయ్యాయి. తల్లిదండ్రులకు బిడ్డలు దూరం అయ్యారు. అలాంటి జీవితాలు ఎన్నో. అయితే ఆ సమయంలోనే వేరు పడిన ఇద్దరు తాజాగా కలిశారు. అంటే సుమారు 75 ఏళ్ల తర్వాత అక్కా తమ్ముళ్లు కలుసుకోగలిగారు. వీరి కలయికకు వేదికైంది కర్తార్‌పూర్ కారిడార్ . ఈ అద్భుతమైన కలయికను చూసి కుటుంబ సభ్యులు కూడా ఆనందంలో మునిగి తేలారు.
1947లో దేశ విభజన సమయంలో పంజాబ్‌కు చెందిన సర్దార్ భజన్ సింగ్ కుటుంబం చెల్లా చెదురైంది. ఆ సమయంలో తోబుట్టువులు విడిపోయారు. 75 ఏళ్ల క్రితం దేశ విభజన తెచ్చిన విపత్కర పరిస్థితులు కారణంగా వీరి కుటుంబానికి కొడుకు షేక్ అబ్దుల్ అజీజ్ దూరమయ్యాడు. కొడుకు పాక్ అక్రమిత కాశ్మీర్ చేరగా.. అక్క తండ్రి వెంట భారత్‌లో ఉండిపోయింది కుమార్తె మహిందర్ కౌర్. అయితే చిన్నతనంలో జాడ కోల్పోయిన అక్కాతమ్ముళ్లను ఏకం చేశారు కుటుంబ సభ్యులు. 75 ఏళ్ల క్రితం విడిపోయిన వీరిని సామాజిక మాధ్యమాల సాయంతో సోషల్ మీడియా సాయంతో వెతుకగా.. పంజాబ్‌లో ఉండే మహిందర్ కౌర్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉండే షేక్ అబ్దుల్ అజీజ్ స్వయానా అక్క, తమ్ముడని తెలుసుకున్నారు. ఇటీవల వీరిద్దరూ కర్తార్‌పూర్ కారిడార్ వద్ద కలుసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం అక్కా తముళ్ల వయస్సు 81 ఏళ్లు, 78 ఏళ్లు. తమ కుటుంబాలతో కలిసి కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో కలుసుకున్నారు. తమ్మడు, అతడి కుటుంబాన్ని చూసి అక్క ఉబ్బితబ్బిబ్బయింది. అలాగే అక్కను చూసి తమ్ముడు ఆనందంలో మునిగిపోయాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.