పార్లమెంటు సభ్యుడిగా రాహూల్ గాంధీపై లోక్ సభ స్పీకర్ అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు సెక్రటరీ జనరల్ సంచలన ప్రకటన చేశారు. ఇటీవల ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను.. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. తాజాగా తెరపైకి ఇప్పుడు మరో ఎంపీ కేసు హాట్ లాపిక్ గా మారింది.
పార్లమెంటు సభ్యుడిగా రాహూల్ గాంధీపై లోక్ సభ స్పీకర్ అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు లోకసభ సెక్రటరీ జనరల్ సంచలన ప్రకటన చేశారు. పరువు నష్టం కేసులో రాహూల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే. ఈ తీర్పుతో ఎంపీగా రాహూల్ గాంధీపై అనర్హత వేటు పడింది. రాహూల్ గాంధీపై లోక్ సభ స్పీకర్ అనర్హత వేటు నిలబడుతుందా లేదా అన్న సందిగ్ధత కొనసాగుతున్న వేళ.. మరో ఎంపీకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఓ హత్య కేసులో జైలు శిక్ష పడి అనర్హతకు గురైన మాజీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ లోక్ సభ సభ్యత్వం పునరుద్దరణ చేశారు. ఆయనపై అనర్హత వేటు ఎత్తివేశారు.. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇటీవల ఓ హత్య కేసులో ఈ ఏడాది జనవరి 11 న కవరత్తి సెషన్స్ కోర్టు మహమ్మద్ ఫైజల్ కి పదేళ్ల జైలు శిక్ష విధించింది. అదే నెల 13 న ఆయనపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, ఫైజల్ తనకు విధించిన జైలు శిక్షను కేరళ హైకోర్టులో సవాల్ చేయగా.. అక్కడ ఆయనకు ఊరట లభించింది. ఈ నేపథ్యంలో ఆయన అనర్హత వేటుపై ఆయన ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయన అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇదిలా ఉంటే.. తన అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు లో విచారణ కొనసాగుతుండగానే.. ఈ నోటిఫికేషన్ రావడం గమనార్హం. ఇక, మహ్మద్ ఫైజల్ లక్షద్వీప్ నుంచి 2019లో ఎంపీగా గెలిచారు.