దేశంలో మరోచోట లిథియం నిల్వలు బయటపడ్డాయి. గతంలో జమ్మూకశ్మీర్‌లో గుర్తించిన లిథియం నిల్వల కంటే ఇవి చాలా రెట్లు ఎక్కువని అధికారులు చెప్తున్నారు. లిథియం నిల్వలు భారత్‌కు కావాల్సిన అవసరాలను దాదాపు 80 శాతం తీర్చగలవని అంచనా వేస్తున్నారు.
దేశంలో అరుదైన ఖనిజ నిక్షేపాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర గనుల శాఖ జమ్మూకశ్మీర్‌లో 5.9 మిలియన్ టన్నుల లిథియం రిజర్వ్‌లు ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజగా దేశంలో మరోచోట లిథియం నిల్వలు బయటపడ్డాయి. రాజస్థాన్‌లోని దేగానా ప్రాంతంలో ఈ నిల్వలను కొనుగొన్నారు. ఇవి జమ్ముకశ్మీర్‌లో ఉన్న లిథియం రిజర్వుల కన్నా చాలా రెట్లు ఎక్కువని తెలుస్తోంది. ఈ లిథియం నిల్వలు భారత్‌కు కావాల్సిన అవసరాలను దాదాపు 80 శాతం తీర్చగలవని అధికారులు అంచనా వేస్తున్నారు.
దేశంలో తొలిసారిగా లిథియం నిల్వలను ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్‌లోని సలాల్ హైమనా ప్రాంతంలో కొనుగన్నారు. ఇది అప్పట్లో సంచలనం. సుమారు 59 లక్షల టన్నుల లిథియం రిజర్వులు గుర్తించినట్లు కేంద్ర గనుల శాఖ తెలిపింది. వీటినిఈ ఏడాది చివరి నాటికి వేలంచేయనున్నారు. గనుల శాఖ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మరోచోట లిథియంనిల్వలు బయటపడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజస్తాన్‌లోని డేగానా(నాగౌర్)లోని రెన్వాత్ కొండ ప్రాంతంలో ఈ నిల్వలు నిక్షిప్తమైనట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ), మైనింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. గతంలో జమ్మూకశ్మీర్‌లో గుర్తించిన లిథియం నిల్వల కంటే ఇవి ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Lithium deposits discovered in Rajasthan after Jammu and Kashmir pic.twitter.com/GR9nNF14At
— Marketing Maverick (@MarketingMvrick) May 8, 2023
ఏదేమైనా దేశంలో వరుసగా లిథియం నిల్వలు బయట పడుతుండడం విద్యుత్ వాహనరంగానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో లిథియం మూలకం కీలకమన్న విషయం తెలిసిందే. నాన్ ఫెర్రస్ మెటల్ అయిన లిథియంను ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో వాడతారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అంటున్న తరుణంలో దేశంలో ఇంత పెద్ద మొత్తంలో లిథియం నిల్వలు బయటపడటం విద్యుత్ వాహనాల రంగానికి మంచిదనే చెప్పాలి. బ్యాటరీల ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే, స్మార్ట్ ఫోన్లలో లిథియం అయాన్ బ్యాటరీలనే వాడుతున్నారు. కావున వీటి ధరల్లో కొంతమేర వ్యత్యాసం ఉండవచ్చు.
#BREAKING #UPDATE#Lithium found in #Rajasthan after Jammu and Kashmir.
The Geological Survey of India (GSI) and mining officials claim that the capacity of lithium reserves found here is higher than the lithium reserves found in Jammu and Kashmir recently. pic.twitter.com/YqwIJbLFjm
— #DextrousNinja (@Ninja0179048354) May 7, 2023