మన దేశంలో గోవా అత్యంత ప్రముఖ పర్యాటక స్థలం అని తెలిసిందే. దేశ విదేశాల నుంచి ఇక్కడ సేద తీరడానికి పర్యాటకులు వస్తుంటారు. గోవా సంస్కృతి కూడా పాశ్చాత్యదేశాల సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ షూటింగ్స్ కూడా బాగానే జరుపుకుంటారు. తాజాగా భారతదేశంలో మొట్టమొదటి ఆల్కహాల్ మ్యూజియం గోవాలో ప్రారంభమైంది.
ఇందులో రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఇంకో విశేషం ఏంటంటే పాతకాలం నాటి మద్యం తయారీ వస్తువులను ఉంచారు. చెక్క డిస్పెన్సర్లు, మద్యం కొలిచే పరికరాలు, గ్లాస్ వేర్, ఫెని బాటిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆల్ ఎబౌట్ ఆల్కహాల్ పేరుతో ఉత్తర గోవాలోని కండోలిమ్ గ్రామంలో స్థానిక వ్యాపారుడు నందన్ కుద్‌చాడ్కర్ ఈ మ్యూజియాన్ని ప్రారంభించాడు. ఇక గోవాలో ఫెనీ అనే మద్యాన్ని తయారుచేస్తారు. జీడిమామిడి ఫలాల నుంచి తయారుచేసే ఫెనీ మద్యం ఎంతో పేరుగాంచింది. ఒకరకంగా ఫెనీ మద్యం గోవాకు వారసత్వ సంపద వంటిదని చెప్పాలి. ఈ మ్యూజియంలో ‘ఫెని’కి సంబంధించి వందలాది పురాతన వస్తువులను ప్రదర్శనకు పెట్టారు.
అప్పటి కాలంలో వివిధ రకాల ఆల్కహాల్‌ను భద్రపరచడానికి ఉపయోగించిన పెద్ద పెద్ద పాత్రలనూ ప్రదర్శించారు. గోవాకు చెందిన గొప్ప వారసత్వ సంపదను ప్రపంచానికి తెలియజేయాలని, ముఖ్యంగా ‘ఫెని’ చరిత్రను చాటిచెప్పాలనే ఉద్దేశంతో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారని నందన్ వివరించాడు. మొదట్లో తనను చూసి ఎగతాళి చేసేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ మద్యం మ్యూజియాన్ని చూసేందుకు సందర్శకులు భారీగానే వస్తున్నారు. పాతకాలం నాటి పరికరాలను చూసి ఆశ్చర్యపోతున్నారని ఆయన అన్నారు. స్కాట్లాండ్, రష్యా దేశాల్లో ప్రజలు తమ వద్ద ఉన్న మద్యాన్ని సంతోషంగా ప్రదర్శిస్తుంటారని, కానీ ఓ మ్యూజియాన్ని లిక్కర్ కోసం ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం అని వెల్లడించారు.
Goa | ‘All About Alcohol’, a museum dedicated to centuries-old alcohol bottles, glasses, and manufacturing equipment opened in Candolim pic.twitter.com/aFY3SScKWt
— ANI (@ANI) October 17, 2021