సహజ పురుష, స్త్రీ సంబంధాలతో విసిగిపోయారో లేక వినూత్నంగా ఆలోచన చేస్తున్నారో లేదా ట్రెండ్ కోసం ఫాలో అవున్నారో తెలియదు కానీ ఇటీవల కాలంలో స్వలింగ సంపర్కులు వివాహం చేసుకుంటున్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్లో ఈ తరహా పెళ్లిళ్లు ఇటీవల కాలంలో జరిగాయి. ఇద్దరు పురుషులు వివాహం చేసుకుని సంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా మరో పెళ్లి సంచలనంగా మారింది.
ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశంలో కూడా మానవత్వ పోకడలు మారుతున్నాయి. ప్రకృతికి వ్యతిరేకంగా కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి. అందులో ఒకటి పెళ్లి. సామాజిక నిబంధనలను ధిక్కరిస్తూ కొంత మంది స్వలింగ సంపర్కులు వివాహం చేసుకుంటున్నారు. సహజ పురుష, స్త్రీ సంబంధాలతో విసిగిపోయారో లేక వినూత్నంగా ఆలోచన చేస్తున్నారో లేదా ట్రెండ్ కోసం ఫాలో అవున్నారో తెలియదు కానీ ఇటీవల కాలంలో ఈ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కేరళ, పశ్చిమ బెంగాల్లో ఈ తరహా పెళ్లిళ్లు ఇటీవల కాలంలో జరిగాయి. ఇద్దరు పురుషులు వివాహం చేసుకుని సంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా మరో పెళ్లి సంచలనంగా మారింది. ఇది కూడా పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకోవడం గమనార్హం. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుంది ఇద్దరు అమ్మాయిలు.
ఇద్దరు ఒకే జాతికి చెందిన వారు వివాహం చేసుకోవడాన్ని స్వలింగ సంపర్కుల వివాహం అంటున్నారు. ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని లెజీబీటీ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్)వర్గానికి చెందిన వారు సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. అయితే 2018లో స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించనప్పటికీ.. వీరి వివాహానికి ఎటువంటి చట్టబద్ధత కల్పించలేదు దేశ అత్యున్నత న్యాయస్థానం. ఇంకా ఈ కేసు కోర్టులో నలుగుతూనే ఉంది. కానీ అంతలోనే కొన్ని స్వలింగ సంపర్కుల జంటలు మాత్రం పెళ్లిళ్లు చేసుకుని.. జీవనం సాగిస్తున్నారు. అలా ఏకమయ్యారు మరో ఇద్దరు అమ్మాయిలు. వారిదర్దరే మౌమితా మంజుదార్, మౌసుమీ దత్తా. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరంలో బెంగాలీ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. కోల్‌కతాలోని షోవాబజార్‌లోని అరిటోలా ప్రాంతంలోని భూత్‌నాథ్ ఆలయంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. అంతకు ముందు హల్దీ, మెహందీ, సంగీత్, ఫెరాస్ వంటి వేడుకలు కూడా చేసుకున్నారు.
ప్రస్తుతం వీరి పెళ్లి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అసలు వీరిద్దరికీ ఎలా పరిచయమైందంటే.. సోషల్ మీడియా ద్వారా. చాలా కాలంల పాటు డేటింగ్ చేసుకున్నాక.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా, వీరిలో మౌసుమీ దత్తా అనే మహిళకు ముందు వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే తన భర్త తనను రోజు చిత్రహింసలకు గురి చేయడంతో ఆమె భర్త నుండి విడిపోయింది. ఆ పిల్లలను తన పిల్లలుగా భావించిన మౌమిత.. మౌసుమీని పెళ్లి చేసుకుంది. ప్రేమ అనేది స్త్రీ పురుషుల మధ్య మాత్రమేనా? ఇద్దరు స్త్రీలు లేదా ఇద్దరు పురుషులు ప్రేమలో కలిసి ఉండలేరా? అని సమాధానం ఇచ్చారు మౌమిత . ఈ పెళ్లికి మౌమిత కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఆమెను ఇంట్లోకి రానివ్వకపోవడంతో.. మౌషుమిని విడిచిపెట్టబోనని ప్రియురాలితో కలిసి అద్దె ఇంట్లో కాపురం పెట్టారు ఈ ఇద్దరు మహిళలు.నీరు లేకుండా చెట్టు బతకదు.. అలాంటిదే తమ బంధమని ప్రకటించారు ఈ ఇద్దరు.