ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో చిత్ర విచిత్రమైన వీడియోలు మన కళ్లముందు ఆవిష్కరించబడుతున్నాయి. ఇందులో కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని కన్నీరు పెట్టించే విధంగా ఉంటున్నాయి.. మరికొన్ని గగుర్పొడిచే విధంగా ఉంటున్నాయి.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మనం ఎన్నడూ చూడని ఫోటోలు, వీడియోలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఎంతో మంది కళాకారులు తమ టాలెంట్ తో స్టార్స్ అవుతున్నారు. గత కొంతకాలంగా అడవులను నరికి వేయడంతో ఆహారం లేక కృరమృగాలు జనారణ్యంలోకి వస్తున్న భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. వీటిలో ఎక్కువగా చిరుత, ఎలుగు బంట్లు, పులులు, తోడేళ్లు సంచరిస్తున్నాయి. ఆహారం కోసం ఆవులు, మేకలు, కోళ్లను.. కొన్నిసార్లు కుక్కలను కూడా ఎత్తుకెళ్లి చంపేస్తున్నాయి. అప్పుడప్పుడు మనుషులపై అటాక్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల అడవిలో ఉండాల్సిన సాధు, కృర జంతువులు జనార్యణంలోకి వచ్చి హల్చల్ చేస్తున్నాయి. ఎక్కువగా చిరుత పులులు జనాల మధ్యకు పగలు, రాత్రి అనే తేడాలేకుండా వస్తున్నాయి. ఇవి ఎక్కువగా మేకలు, ఆవులపై దాడులు చేసి తింటున్నాయి. కొన్నిసార్లు వీటికి మనుషులు కూడా బలి అవుతున్నారు. ఓ వ్యక్తి భూమిపై నుకలు ఇంకా ఉన్నాయని తెలియజేసే ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీడియోలు ఉన్న ప్రకారం.. ఓ డాబాలో మంచంపై వ్యక్తి దుప్పటి కప్పుకొని నిద్రిస్తున్నాడు. అతనికి కొద్ది దూరంలోనే ఓ కుక్క నిద్రిస్తుంది. డాబాలోకి మెల్లిగా చిరుత వచ్చి నిద్రిస్తున్న కుక్క మెడ పట్టుకొని లాక్కెళ్లింది. ఇది ఆ మనిషి మెల్లిగా దుప్పటి తీసి చూసి భయంతో వణికిపోయాడు. మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. నిజంగా ఇది ఓ అద్భుతం.. లేదంటే మనిషి ప్రాణాలు అమాంతం గాల్లో కలిసి పోయేవి అంటు ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఒక్క క్షణం ఆ చిరుత కళ్లు మనిషిపై పడి ఉంటే ఎంత దారుణం జరిగి ఉండేది.. నిజంగా అతడు అదృష్టవంతుడు అంటూ మరో నెటిజన్, ఆ వ్యక్తి కుక్క కారణంగా బతికి బయటపడ్డాడు.. మనోడికి భూమిపై ఇంకా నూకలు రాసిపెట్టి ఉన్నాయని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా ఈ ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
They love hot dogs. Look at the stealth & agility. Dog had no idea what was coming. A leopard in action on side of busy Pune-Nashik highway. pic.twitter.com/cn0pJDhCV9
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 18, 2023