ప్రజలు నీటితో అల్లాడుతుంటే గంగమ్మ హాయిగా శివుడి సిగలో నివాసం ఉంది. ప్రజల కష్టాలు చూడలేని భగీరథుడు గంగమ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన తన తపస్సుతో గంగమ్మను దివి నుంచి భువికి రప్పించాడు. అదే తరహాలో 30 ఏళ్లు శ్రమించి తన ఊరికి తాగు, సాగు నీరందించాడు ఈ కలిగియుగ భగీరథుడు. అది ఎక్కడ జరిగింది. ఎవరు ఆ వ్యక్తి, తన ఊరికోసం ఆయన చేసిన సాహాసం ఏంటో తెలుసుకుందాం.
బీహార్ రాష్ర్టంలోని గయా జిల్లా లహ్తూవా ప్రాంతానికి చెందిన వ్యక్తి లౌంగీ భూయాన్ వృద్ధుడు. అతని ఊరు కొండ ప్రాంతంలో ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లోని కొండలపై నిత్యం వర్షాలు పడుతుంటాయి. అయిన ఆ ప్రాంతంలోని వారికి తాగునీటి సమస్య ఉండేది. కారణం కొండలపై పడిన వర్షపు నీరు వాగులో వృథాగా పోయేవి. దీనిని గమనించిన భూయాన్ ఆ నీటిని ఎలాగైన తన ఊరికి తరలించాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా కొండ నుంచి తన గ్రామాన్నికి కాలువ తవ్వడం ప్రారంభించాడు. ఎవరి సహాయం తీసుకోకుండా 30ఏళ్ల పాటు శ్రమించి మూడు కిలోమీటర్ల మేర కాలువ తవ్వాడు.
ఆ ప్రయత్నం చేసే సమయంలో పశువులను కొండ ప్రాంతానికి తోలుకెళ్లి అవి మేస్తుండగా భూయాన్ కాలువ తవ్వేవాడు. ఇలా ఒక కాలువ పూర్తి చేసి తన ఊరితో పాటు ఐదు గ్రామాలకు తాగు నీరు అందించాడు. కొండ ప్రాంతంలో వర్షం పడితే ఆ నీరు వృథా నదిలోకి పోకుండా.. ఈ కాలువకు మళ్లీంచాడు. దీంతో ఆ ప్రాంతాల గ్రామ ప్రజల వ్యవసాయానికి నీటి కష్టాలు తీరాయి. భూయాన్ చేపలు పట్టేందు మరో కాలువ తవ్వేందుక సిద్ధమైయాడు.
భూయాన్ ఊరి కోసం ఎంతో మేలు చేశాడని, ఊరు ఆయనకు ఎప్పుడు బుణపడి ఉంటుందని అక్కడి స్థానికులు, ఆ ఊరి ఉపాధ్యాయులు అతని ప్రశంసించారు. ఆ పెద్దాయన కష్టం ఊరికే పోదని దానకి తగిన ఫలితం ఆయనకు లభిస్తుందని ఆ గ్రామ ప్రజలు అన్నారు. గతంలో ఇదే విధంగా గయ ప్రాంతలో దశరథ్ మాంజీ ఎత్తైన కొండను తవ్వి ఆయన గ్రామానికి రహదారి ఏర్పాటు చేశాడు. ఊరి రుణం తీర్చుకోవాలి.. లేకుంటే లావైపోతాము అనే శ్రీమంతుడు సినిమాలోని డైలాగ్ యువకులకు ఏమో కానీ ఈ భూయాన్ కు సరిగ్గా సరిపోతుంది. ఊరి కోసం ఇంకా పని చేస్తానంటున్నాడు లౌంగీ భూయాన్. ఈ పెద్దాయన చేసిన అపర భగీరథ ప్రయత్నంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.