రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా దూర ప్రాంతాలకు జర్నీ చేసేవారు రైలుకే ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ జర్నీ సందర్బంలో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా టిక్కెట్ సంబంధించిన ఇష్యూలు ఎక్కువ వస్తాయి. ఆన్ లైన్ లో చేసుకున్న టికెట్ ఫోన్ లో ఉండిపోయి.. అది స్విచాఫ్ కావడం. పీఎన్ఆర్ నెంబర్ మరిచిపోవడం వంటివి చేస్తుంటారు కొందరు. అయితే అలాంటి వారు జాగ్రత్త ఉండాలని, లేకుంటే జరిమానా చెల్లించాల్సి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. అసలు రైల్వే సంస్థ తెలిపిన కొన్ని విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మధ్యకాలంలో అందరూ రైల్వే టికెట్లను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు. అలానే బుకింగ్ అనంతరం ప్రింట్ తీసుకోవడం చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఫోన్ లో ఉంది కదా.. అనే ధైర్యంతో చాలా మంది పేపర్ ఫ్రింట్ తీసుకోరు. అయితే రైల్లో సుదూరంగా ప్రయాణిస్తున్న సమయంలో చాలా సార్లు ఫోన్స్ స్విచాఫ్ అవుతుంటాయి. అంతేకాక టికెట్ పీఎన్ ఆర్ నంబర్ కూడా గుర్తుపెట్టుకోరు. దీంతో అవసరం ఉన్న సమయాలలో టీసీ కి టికెట్ చూపించడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ విషయంపై తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏకలవ్య చక్రవర్తి పలు విషయాలు వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ.. “ప్రయాణీకులు రైలు ఎక్కిన తర్వాత టికెట్ ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం, పిఎన్ఆర్ నంబర్ గుర్తులేని సమయంలో భారతీయ రైల్వే అటువంటి ప్రయాణికుడిని ‘టికెట్‌లెస్ ట్రావెలర్’గా పరిగణిస్తారు. నిబంధనల ప్రకారం అతనికి జరిమానా విధించబడుతుంది” అని తెలిపారు. అందుకే ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయే తెలియదు కాబట్టి… ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నవారు హార్డ్ కాఫీని కూడా దగ్గరలో ఉంచుకోవటం మంచింది. ఫోన్ స్వీఛాప్ అయిన సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది. టికెట్, పీఎన్ఆర్ నెంబర్ లేని వారికి రైల్వే సంస్థ జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఫోన్ లో టికెట్ తో పాటు ఓ హర్డ్ కాపీ తీసుకుంటే కూడా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు.