నవంబర్ 28వ తారిఖు ఓ మైనర్ బాలిక తనను కిడ్నాప్ చేసి.. రెండు రోజులు బంధించి అత్యాచారం చేశాడని ఓ యువకుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వేట కొనసాగించి ఆ నిందితుడిని పట్టుకున్నారు. ఇంకేముంది కేసు క్లోజ్ అనుకుంటున్నారా? కాదు ఇక్కడే అసలైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ అత్యాచార కేసు గురించి అసలు నిజాలు తెలిసిన పోలీసులు అవాక్కైయ్యారు. పోలీసులే కాదు స్థానికులు కూడా ఈ విషయం తెలిసి ముక్కుమీద వేలు వేసుకున్నారు. ఆశ్చర్యకరమైన ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం పదండి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని సిరోహీ పోలీస్ స్టేషన్ లో నవంబర్ 28న ఓ మైనర్ బాలిక తనను కిడ్నాప్ చేసి, రెండు రోజులు బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 5న నిందితుడు శంకర్(25) ను మేడా గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ”నేను ఆ బాలికను కిడ్నాప్ చేసిన మాట నిజమే కానీ.. ఆమెను అత్యాచారం మాత్రం చేయలేదు. ఎందుకంటే నేను అబ్బాయిని కాదు అమ్మాయిని” అని శంకర్ విచారణలో ఒప్పుకున్నాడు.
కానీ పోలీసులు నమ్మలేదు. దాంతో తనకు వైద్య పరీక్షలు జరపాలని కోరాడు. దాంతో పోలీసులు వైద్య పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో నిజంగానే శంకర్ అమ్మాయి అని తేలింది. అదీకాక ఆమె మూడేళ్ల కిందట ఓ బిడ్డకు సైతం జన్మను ఇచ్చినట్లు తేలింది. ఆ బాలికకు కూడా వైద్య పరీక్షలు చేయగా అత్యాచారం జరగలేదని తేలింది. దాంతో కంగుతిన్న పోలీసులు.. ఇది అత్యాచారం కేసు కాదని కిడ్నాప్ కేసు అని పేర్కొన్నారు. అయితే జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాలను, బాధలను తట్టుకునే క్రమంలోనే జుట్టు కత్తిరించుకుని, అబ్బాయిలా తిరుగుతున్నానని, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కక్క పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నానని నిందితురాలు చెప్పుకొచ్చింది. ఆమెను అరెస్ట్ చేసి, కోర్ట్ లో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.
Rajasthan | On 28th Nov, a minor from Sirohi registered a complaint that she was raped when she went to a washroom. We conducted the probe & arrested the accused. During the medical test, it was revealed that the accused is a woman, not man: Maya Pandit, Station Officer, Sirohi pic.twitter.com/9H3R8R0E5j
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 17, 2022