ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. పైకి అందరూ మంచి వారుగానే కనిపిస్తున్నారు. అవకాశం లభించగానే వారిలోని రాక్షసత్వాన్ని బయటకు తీసుకువస్తున్నారు. నమ్మించి.. జీవితాలను నట్టేట ముంచుతున్నారు. ఈ తరహా సంఘటనలు దేశంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి హర్యానాలో చోటు చేసుకుంది. ప్రేమించిన వాడు పిలిచాడని.. అతడి మీద నమ్మకంతో.. పిలిచిన ప్రదేశానికి వెళ్తే.. అమ్మాయి జీవితామే నాశనం అయ్యింది. ప్రియుడి మిత్రులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : ఎదురింటి మహిళపై భర్త కన్ను.. దగ్గరుండి అత్యాచారం చేయించిన భార్య..
ఫతేహాబాద్ కు చెందిన ఒక యువతి స్థానికంగా ఉండే సంజయ్ అనే యువకుడిని ప్రేమించింది. గత నెల 20 న సంజయ్, యువతిని తన ఫామ్ హౌస్ కి తీసుకెళ్లాడు. ప్రియుడే కదా అని నమ్మి వెళ్లిన యువతికి అక్కడ మరో ముగ్గురు యువకులు కనిపించారు. సంజయ్ ఆ యువకులను తన స్నేహితులుగా పరిచయం చేసి అందరికి టీ ఇచ్చాడు. టీ తాగిన యువతి కొద్దిసేపటికి స్పృహ కోల్పోయింది. తరువాత ప్రియురాలిని ముగ్గురు స్నేహితులకు అప్పగించిన సంజయ్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఆ ముగ్గురు.. ఆమెను సామూహికంగా అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు. యువతి స్పృహలోకి వచ్చి చూసేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అప్రమత్తమైన యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో తమ దగ్గర వీడియోలు ఉన్నాయని, ఎవరికైనా చెప్తే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు.
ఈ విషయంపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న యువతి..వారి ఆగడాలు శృతిమించడంతో ధైర్యం తెచ్చుకొని జరిగిన విషయాన్ని బయటపెట్టింది. వీడియోలను అడ్డుపెట్టుకొని ఎక్కడికి పడితే అక్కడకు రమ్మంటున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.