తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామ రావు (కేటీఆర్) పార్టీ శ్రేణులకు, తన అభిమానులకు షాక్ ఇచ్చారు. ఆయన షాక్ ఇవ్వడమేంటి అని అనుకుంటున్నారా..? అవును..ఆయన తాజాగా చేసిన ప్రకటన పార్టీ శ్రేణులకు ఒకరకంగా షాక్ అనే చెప్పాలి. విషయం ఏంటంటే..? రేపు కేటీఆర్ జన్మదినం కావటంతో ఆయనను కలిసేందుకు ఎవరు నా వద్దకు రావొద్దంటూ పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. తనను కలవటానికి చాల మంది అభిమానులు వస్తారని అన్నారు. గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ఈ నేపథ్యంలో నన్ను కలిసేందుకు ఎవ్వరు కూడా ఇబ్బంది పడి రావొద్దంటూ పిలుపునిచ్చారు.
ఇక దీన్ని ఇంకోలా అర్ధం చేసుకోవొద్దని కూడా తెలిపారు కేటీఆర్. రాష్ట్రంలో ఆగకుండా వర్షాలు కురుస్తున్నాయని, క్షేత్ర స్థాయిలోని ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు కేటీఆర్. ఈ నిర్ణయం పట్ల పార్టీ శ్రేణులు, అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పార్టీ శ్రేణులు ఎక్కడివారు అక్క్డడే కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఇక గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా వాగులు, వంకలు నిండిపోతున్నాయి. ఇక ప్రాజెక్టుల్లో కూడా నీటిమట్టం పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.