ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం.. సుఖవంతం’అంటారు. ఏ రాష్ట్రాంలో అయినా ఈ స్లోగన్ తప్పకుండా ఉంటుంది. సామాన్య ప్రుజలు తమ ప్రయాణాలకు ఆర్టీసీ ఎంచుకుంటారు. అలా అనుకొని ఓ కుటుంబం ఆర్టీసీ బస్సులో వస్తే కండెక్టర్ షాక్ ఇచ్చాడు. సాధారణంగా లగేజీ పరిమితి దాటితే.. ఎక్స్‌ట్రా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓ బుల్లి కోడిపిల్లకు హాఫ్ టికెట్ తీసుకున్న విచిత్ర ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర కన్నడ జిల్లా సిద్ధపుర నుంచి ఓ సంచార జాతి కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు… రూ.10కి కోడి పిల్లను కొనుగోలు చేశారు. దాన్ని తీసుకుని వారు హోసనగర నుంచి షిరూరుకు డిసెంబరు 31న ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ) బస్సులో పయనమయ్యారు. ఈ క్రమంలో కండెక్టర్ ని మూడు టిక్కెట్లు అడిగారు. అదే సమయంలో వారి సంచిలో నుంచి ‘కిచ్కిచ్’ అని శబ్దం రావడాన్ని ఆ బస్సు కండక్టర్ గమనించాడు. ఇక వారి సంచిని పరిశీలిస్తే కోడిపిల్ల కనిపించింది. అదేంటీ చిన్న కోడిపిల్లకు కూడా టికెట్ తీసుకుంటా? అని వారు ప్రశ్నించారు. కోడిపిల్లకు కూడా టికెట్ తీసుకోవాలని కండక్టర్ డిమాండ్ చేశాడు. అది రూల్ అని.. పక్కా టికెట్ తీసుకోవాల్సిందే అని పేర్కొన్నాడు. దీంతో చేసేదేం లేక ఆ కుటుంబం ఆ కోడి పిల్ల కోసం హాఫ్ టికెట్ తీసుకున్నారు.
ఇలా రూ.10తో కొనుగోలు చేసిన కోడి పిల్లను తీసుకెళ్లేందుకు.. ఆ కుటుంబం రూ.50 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. కోడిపిల్ల టికెట్ తో కలిసి వారికి మొత్తం రూ.353 అయింది. ఈ వ్యవహారాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇది వైరల్ గా మారింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.