దేశంలో కొంత కాలంగా పాశ్చాత్య నాగరికత పెరిగిపోతుంది. కేరళాలో గత కొంత కాలంగా తమ జీవిత భాగస్వాములను వేరే వారికి అప్పగించి.. ఇతరుల భాగస్వాములతో లైంగిక సుఖాన్ని పొందాలనుకునే భావజాలం దారుణంగా విస్తరిస్తోంది. ఇందుకోసం కొంత మంది భర్తలు తమ భార్యలను మానసికంగా వేధిస్తూ.. ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఓ వివాహిత ఈ దారుణం నచ్చకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. ఇప్పటి దాకా ఏడుగురిని అరెస్టు చేశారు. మరో రెండు రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నిందితులు రాష్ట్రంలోని మూడు జిల్లాలకు చెందిన వారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యక్తులు ఈ రాకెట్‌లో భాగమని పోలీసులు తెలిపారు.
తన భర్త బలవంతంగా మరో వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నట్టు బాధితురాలు కేరళలోని కురుకచల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల సాయంతో ఒక గ్రూపు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. తమకు ఫిర్యాదు చేసిన బాధితురాలి భర్తను అరెస్ట్ చేసినట్టు, దీని వెనుక పెద్ద ముఠానే ఉందని చంగన్ చెర్రి డీఎస్పీ ఆర్ శ్రీకుమార్ తెలిపారు.
ఇది చదవండి : కుక్కకు బర్త్ డే పార్టీ! ఆ ఇంట్లో వారు అరెస్ట్!
టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి, వీటి ద్వారా సభ్యుల మధ్య అనుసంధానత కల్పిస్తున్నారు. ఆ తర్వాత స్త్రీల మార్పిడి జరిగేది. ఒక స్త్రీని ముగ్గురు పురుషులు పంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత మంది పురుషులు తమ భార్యలను ఒక రోజు శారీరక సంబంధం కోసం.. డబ్బు కోసం అందజేయడంతో గ్రూప్ లోని కొందరు వ్యక్తులు డబ్బులు కూడా ఇచ్చుకునేవారు. సామాజిక మాధ్యమ గ్రూపుల ద్వారా నడుస్తున్న భాగస్వాముల మార్పిడి ముఠాలో సుమారు 1,000 మంది వరకు ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 25 మందిపై నిఘా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.