అధికారాన్ని అడ్డుగా పెట్టుకున్ని కొందరు ఆక్రమాలకు పాల్పడుతుంటారు. కొందరు ప్రజాప్రతినిధులు అడ్డదారుల్లో డబ్బులు సంపాదించి.. కూడా పెడుతుంటారు. మరి కొందరు వారి అధికార బలంతో కుటుంబ సభ్యులకు అడ్డదారిలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చేస్తుంటారు. అలా చాలా మంది అక్రమంగా ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు చేస్తూ.. ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మాత్రం దొరికిపోతున్నారు. తాజాగా అలానే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ మంత్రి కూతురుకి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని ఆమె ఉద్యోగం పొందారని కోర్టు తేల్చింది. ఆమె నియమాకాన్ని రద్దు చేసింది. అసలు వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పరేశ్ చంద్ర అధికారి. ఆయన కుమార్తె అకింత చంద్ర అధికారి. ఆమె ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. అయితే ఉద్యోగం రిక్రూట్ మెంట్ సమయంలో అకింత కంటే ఎక్కు మార్కులు సాధించిన తనకు ఉద్యోగం దక్కకుండా చేశారంటూ ఓ అభ్యర్థి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనకు 77 మార్కులు, అంకిత అధికారి 61 మార్కులు వచ్చాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ అంశపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం అకింతను దోషిగా తేల్చింది. ఆమె ఉద్యోగం నుంచి తొలగించాలని, అంతే కాకుండా ఇప్పటి వరకు ప్రభుత్వ నుంచి పొందిన జీతాన్ని వెనక్కి ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
ఇదీ చదవండి: వినియోగదారులకు శుభవార్త! ఇలా చేస్తే ఉచితంగానే గ్యాస్ సిలిండర్!జస్టిస్ అవిజిత్ గంగోపాధ్యాయ కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. జీతాన్ని రెండు విడతలుగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వద్ద జమ చేయాలని ఆదేశించింది. పైగా ఈ ఉద్యోగ నియామకంపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఖాళీ అయిన ఆ పోస్టును పిటిషనర్‌కు కేటాయించాలని కోర్టు సూచించింది. కాగా మంత్రి పరేశ్ చంద్ర అధికారి తన కుమార్తె అక్రమ నియామకంపై విచారణ కోసం స్థానిక CBI కార్యాలయానికి వెళ్లారు.
అయితే అప్పటికే సీబీఐ ముందు మంత్రి హాజరవ్వడానికి గడువు ముగిసిపోయింది. దీంతో మంత్రిపై సీబీఐ అధికారులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. అలాగే మంత్రి కుమార్తెపై ఐపీసీ సెక్షన్లు 420, 120B (నేరపూరిత కుట్ర), అవినీతి నిరోధక చట్టం కింద వేరే కేసులు కూడా పెట్టారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.