సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది తమదైన టాలెంట్ తో బాగా పాపులర్ అవుతున్నారు. డ్యాన్స్, యాక్షన్, కామెడీతో కొంతమంది అలరిస్తే.. కనీవినీ ఎరుగని సాహసాలతో మరికొంతమంది ఆకట్టుకుంటున్నారు.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చిత్ర విచిత్రాలకు సంబంధించిన వీడియోలు మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. అందులో మనల్ని కన్నీరు పెట్టించే విధంగా ఉంటే.. కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటున్నాయి. అంతేకాదు ఎంతో మంది కళాకారులు తమలో ఉన్న ప్రతిభను చూపించుకునే అవకాశం అభిస్తుంది. సోషల్ మీడియాలో వినూత్న సాహసాలు, డ్యాన్స్, నటన, కామెడీ ఇలా ఎన్నో రకాలుగా తమలో ఉన్న సత్తా చూపిస్తూ ఒక్కసారే స్టార్స్ గా మారిపోతున్నారు.
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించే పనిలో ఉన్నారు. ఈ మద్య బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ కొంతమంది అదరగొడుతున్నారు. రీల్స్, షార్ట్స్ చేయడం బాగా ట్రెండ్ అవుతుంది. ఇటీవల మనం ఎక్కడికి వెళ్లినా పార్కులు, మాల్స్, మెట్రోలు, రైళ్లు, రోడ్డు మార్గాల్లో రీల్స్ చేస్తూ యువతీ, యువకులు నానా హంగామా చేస్తున్నారు. తమ రీల్స్ కి ఎక్కువ వ్యూస్ కోసం కొన్నిసార్లు ఎదుటి వారిని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొంతమంది సోషల్ మీడియాలో క్రేజీ కోసం మెట్రో రైల్వే స్టేషన్లలో డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అదరకొడుతున్నారు. అయితే వీటిపై విమర్శలు తలెత్తుతున్నాయి.
ఇదిలా తమిళ సాంగ్ కి కొచ్చి మెట్రో సిబ్బంది చాలా స్టైలిష్ గా డ్యాన్స్ వేస్తూ అదరగొట్టారు. ఈ వైరల్ వీడియో ని కొచ్చి మెట్రో రైల్ అధికార పేజ్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ క్లిప్ లో మెట్రోలో పనిచేస్తున్న యువతీ, యువకుడు దసరా మూవీ తమిళ వర్షన్ నుంచి ‘మైనారు వెట్టి కట్టి’ సొంగ్ కి అద్బుతమైన డ్యాన్స్ చేసి మెప్పించారు. మొదట ఓ యువతి నవ్వులు రువ్విస్తూ పాటకు స్టెప్పులు వేస్తుండగా ఓ యువకుడు మెల్లిగా వచ్చి ఆమెతో జాయిన్ అయి స్టెప్పులు వేస్తాడు. ఈ వీడియో నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 31,000 కు పైగా వ్యూస్ లభించాయి. మరో వీడియోలో కొచ్చి మెట్రోలో పనిచేసే ఇద్దరు మహిళలు తమ డ్యాన్స్ మూమెంట్స్ తో హూషారెత్తించారు.