Miyazaki Mangoes: ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్లు ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంటాయి. మామిడి పండ్ల సీజన్ మొదలైన కొత్తలో రేట్లు ఎక్కువగా ఉన్నా.. సీజన్ ముగిసే సమయానికి రేట్లు తగ్గిపోతుంటాయి. ఇది అన్ని రకాల పండ్ల జాతులకు వర్తిస్తుందేమో కానీ, ‘‘మియజాకి’’ పండ్ల జాతికి మాత్రం కాదు. ఈ పండ్ల ధరకు సీజన్ ఎన్నడూ అడ్డరాదు. ఎందుకంటే వీటి రేటు ఎప్పుడూ సామాన్యుడి ఊహకు మించే ఉంటుంది. ఒక కిలో ధర 2.70 లక్షల రూపాయలు. ఏంటి అంత రేటా?.. అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ‘‘మియాజాకి’’ పండ్లే ప్రపంచంలో అత్యంత ఖరీదైన మామిడి పండ్లు. జపాన్‌కు చెందిన ఈ పండ్లు ప్రస్తుతం ఇండియాలో కూడా పండుతున్నాయి.
మధ్యప్రదేశ్, జబల్‌పూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నానాఖేదాకు చెందిన సంకల్ప్ సింగ్ పరివార్ తన తోటలో ఈ పండ్లను పండిస్తున్నాడు. కేవలం ఈ పండ్లనే కాదు.. చాలా రకాల పండ్లను పండిస్తున్నాడు. వీటికి కాపలాగా పెద్ద సంఖ్యలో శునకాలను రంగంలోకి దించాడు. అవి 24 గంటలు వాటికి కాపలా కాస్తుంటాయి. ఈ మామిడి పండ్లను చూడటానికి ప్రజల్ని అనుమతిస్తున్నాడు. కానీ, వాటితో సెల్ఫీలు తీసుకోవటం, తాకటం వంటివి చేయకూడదని ఆంక్షలు విధించాడు. ‘మియాజాకి’ మామిడి పండ్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : విషాదం… పుట్టగొడుగులు తిని 13 మంది మృతి!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.